MLC Kavitha : కేసీఆర్ పాలనలో నీటి ప్రాజెక్టుల పురోగతి
- కృష్ణా జలాలపై ప్రభుత్వ వైఫల్యం బయటపడింది
- కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత ఏర్పడింది
- నీతిగల పాలన అవసరం : ఎమ్మెల్సీ కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha : తెలంగాణ ప్రభుత్వం నీటి విషయంలో రాజకీయాలు చేయడం తగదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘నీళ్లు – నిజాలు’’ అనే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆమె, నీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టులను కేసీఆర్ హయాంలోనే పూర్తి చేశారని, మిగిలి ఉన్న చిన్న పనులను పూర్తి చేసి ప్రజలకు మేలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం నీటి ప్రాజెక్టులను అశ్రద్ధచేస్తోందని, రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని సూచించారు. ప్రాజెక్టుల విషయంలో నిజాలు చెప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
కవిత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో నీటి వనరుల పాత్ర ఎంతో ముఖ్యమని, ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్లలో కేవలం 50 లక్షల ఎకరాలకు మాత్రమే నీరందించగలిగారని, కానీ కేసీఆర్ హయాంలో 10 ఏళ్లలోనే కోటి ఎకరాలకు పైగా సాగునీరు అందించగలిగామని వివరించారు. కాలంతో పోటీ పడుతూ, అత్యాధునిక సాంకేతికతను వినియోగించి, ప్రపంచ స్థాయిలోనే అద్భుతంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి వరంగా మారిందన్నారు. కోటి 24 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టులను పూర్తి చేయగలిగిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందని తెలిపారు.
Mamta Kulkarni: సన్యాసిగా మారిన బాలీవుడ్ యాక్టర్ “మమతా కులకర్ణి” బహిష్కరణ..
‘‘సీఎం రేవంత్ రెడ్డి మిస్ గైడెడ్ మిస్సైల్‌లా వ్యవహరిస్తున్నారు. ఆయన కేసీఆర్‌ను శత్రువుగా భావిస్తున్నా, నిజమైన శత్రువు మన జలాలను తరలించే ఆంధ్రా పాలకులని గమనించాలి’’ అని కవిత అన్నారు. ఆంధ్రా కేడర్‌కు చెందిన ఆదిత్యానాథ్ దాస్‌ను బాధ్యతల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కృష్ణా ట్రైబ్యునల్‌లో తెలంగాణ తరఫున బలంగా వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర హక్కులను కాపాడే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని కోరారు.
‘‘కాంగ్రెస్ ప్రభుత్వం మునుపటి పాలకుల హయాంలో ప్రారంభమైన పథకాలన్నీ కొనసాగిస్తూనే ఉంది. వైఎస్ఆర్ హయాంలో ప్రారంభమైన ఆరోగ్యశ్రీ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం బలంగా అమలు చేసింది. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ కేంద్రంలో కొనసాగిస్తోంది. అలాగే కేసీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కొనసాగించాలి’’ అని కవిత వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయానికి లోనవకుండా నిజాయితీగా పాలన సాగించాలన్న కవిత, ప్రాజెక్టుల పనులను వేగంగా పూర్తి చేసి రైతులకు తక్షణమే ప్రయోజనం కలిగేలా చూడాలని సూచించారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం నీటి ప్రాజెక్టులను పట్టించుకోకపోవడం, జలవనరుల అభివృద్ధిని విస్మరించడం దురదృష్టకరమ’’ని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని, లెక్కలు చెప్పడమే కాదు, ప్రజలకు అందేలా కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
మొత్తంగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీటి వనరుల విషయంలో రాజకీయాలు చేయడం సరైంది కాదని, బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిచేయాలని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ విధానాలు అమలవ్వాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
AP DSC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన నారా లోకేష్.. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడంటే..!
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?