Krishna District: తన కూతురు పడొద్దని ఆ యువకుడికి ఆ తండ్రి ఎన్నిసార్లు చెప్పాడో.. చివరకు ఆవేశం ఆగక కడతేర్చాలని చూశాడు. పద్ధతి గల కుటుంబం కావున తన కూతురు వెంట ఓ యువకుడు పడుతున్నాడని నలుగురికి తెలిస్తే పరువు పోతుందనుకున్న తండ్రి.. చివరకు చంపేందుకు సిద్ధమయ్యాడు. సినిమాటిక్ టైప్ లో తన కొడుకుతో కలిసి తన కూతురు వెంటపడుతున్న యువకుడిపై దాడి చేశారు.
Read Also: Chandrababu: జగనన్న వదిలిన బాణం ఏమయ్యింది.. తిరిగి జగన్ వైపు దూసుకు వస్తుంది..
వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలం పెద్దపాలెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తన కూతురు వెంట పడుతున్నాడని షేక్ హుస్సేన్ షరీఫ్ అనే వ్యక్తిపై యువతి తండ్రి, తమ్ముడు కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో షేక్ హుస్సేన్ షరీఫ్ కు తీవ్ర గాయాలు అవటంతో.. స్థానికులు అతన్ని 108 వాహనంలో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా.. హుస్సేన్ షరీఫ్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు వైద్యులు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నాగాయలంక పోలీసులు.
Read Also: Sailesh Kolanu : కమల్ హాసన్ గారికి వీరాభిమానిని.. కానీ సైంధవ్ తో వెంకీ మామా అభిమాని అయిపోయా..