Suicide: కృష్ణా జిల్లాలోని గుడివాడలో విషాదం చోటుచేసుకుంది. క్షణికావేశంలో భార్యాభర్తలు సూసైడ్ చేసుకున్నారు. 500 రూపాయల కోసం భార్యాభర్తల మధ్య వివాదం జరిగినట్లు తెలిసింది. ఈ క్రమంలో భార్య మీద కోపంతో ఇంట్లోనే ఉరి వేసుకొని భర్త కొలుసు రాంబాబు ఆత్మహత్య చేసుకున్నారు. భర్త ఉరి వేసుకున్న విషయాన్ని తల్లి కనకదుర్గ తన కొడుకుకు ఫోన్ చేసి చెప్పింది. వెంటనే తన తండ్రిని కొడుకు హుటాహుటిని ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే రాంబాబు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Read Also: Maharashtra: లింగమార్పిడి చేయించుకున్న పోలీస్ కానిస్టేబుల్.. మగబిడ్డకు తండ్రయ్యాడు..
తండ్రి చనిపోయిన విషయాన్ని ఫోన్ ద్వారా కుమారుడు తల్లికి వివరించాడు. భర్త మరణవార్త విని మనస్తాపం చెందిన భార్య కనకదుర్గ ఇంట్లోనే ఉరివేసుకుని చనిపోయింది. తండ్రి శవాన్ని తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఉరి వేసుకుని వేలాడుతున్న తల్లిని చూసి కుమారుడు షాక్ అయ్యాడు. అమ్మనైన కాపాడుకుందాం అని కుమారుడు ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకపోయింది. అప్పటికే అతని తల్లి కనకదుర్గ ప్రాణాలు కోల్పోయింది. చిన్న గొడవ కారణంగా క్షణికావేశంలో భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనాస్థలానికి చేరుకొని దంపతుల మరణానికి గల కారణాలను వన్ టౌన్ పోలీసులు తెలుసుకుంటున్నారు.