Kovvur: అప్పు తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లించమని అడిగిన పాపానికి నిజంగా నరికేశారు. మెడలో ఉన్న బంగారు వస్తువులను దొంగలించారు. వేళ్లకు ఉన్న ఉంగరాలు రావడంలేదని చేతినే నరుక్కుని పోయారు. తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం కలిగించిన దొమ్మెరు హత్య కేసును కొవ్వూరు పోలీసులు ఛేదించారు. సెల్ ఫోన్స్ సిగ్నల్స్ అధారంగా దుండగులను చాకచక్యంగా పట్టుకున్నారు పోలీసులు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పెండ్యాల ప్రభాకరరావు వేస్ట్ మెటీరియల్ ను కొనడం, అమ్మడం వ్యాపారం చేస్తాడు. ప్రభాకరరావు కొవ్వూరు మండలం దొమ్మేరు శివారు పొలంలో గత నెల 26వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కొవ్వూరుకు చెందిన పెండ్యాల ప్రభాకరరావును దొమ్మేరులో దుండగులు హత్య చేసి చేతిని ఎత్తుకెళ్లారు.
Also Read: Paddington in Peru : అందరికీ ఇష్టమైన ఎలుగుబంటి తిరిగి వచ్చింది !
ప్రభాకరరావును దుండగులు అతి కిరాతకంగా చంపేశారు. ప్రభాకరరావు మెడలో ఉన్న బంగారు వస్తువులను దొంగలించారు. వేళ్లకు ఉన్న ఉంగరాలు రావడంలేదని చేతినే నరుక్కుని పోయారు. మృతిని భార్య పెంద్యాల అనంతలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొవ్వూరు పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. హత్యకు పాల్పడిన నిందితుడు తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామానికి చెందిన సచివాలయ సర్వేరు మక్కా రామ శ్రీనివాస్ గా పోలీసులు గుర్తించారు. మక్కా రామ శ్రీనివాస్ తో పాటు తన స్నేహితులు ఇద్దరితో కలిసి ప్రభాకరరావును హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. అయితే ప్రభాకరరావు హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణంగా పోలీసులు గుర్తించారు.
మృతుడు పెండ్యాల ప్రభాకరరావు వద్ద పెద్దేవం గ్రామ సచివాలయ సర్వేరు మక్కా రామ శ్రీనివాస్ 2 లక్షల 40 వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు. అప్పుగా ఇచ్చిన సొమ్మును తిరిగి ఇవ్వాలని ప్రభాకరరావు అడగడంతో చుక్కా రామ శ్రీనివాస్. మరో ఇద్దరితో కలిసి హత్యాకు ప్లాన్ చేశాడు. గత నెల 26వ తేదీన రాత్రి 9 గంటల సమయంలో చుక్కా రామ శ్రీనివాస్ ఫోన్ చేసి డబ్బులు అప్పు విషయమై మాట్లాడదాం రమ్మని ప్రభాకరరావును దొమ్మేరు రావాలని చెప్పాడు. దానితో ప్రభాకరరావు దొమ్మేరు శివారులోని పొలంలోకి వెళ్లాడు. అప్పటికే మరణాయుధాలతో వేచి ఉన్న చుక్కా రామ శ్రీనివాస్, అతని స్నేహితులు ప్రభాకరరావును కత్తితో నరికి చంపారు. అనంతరం ప్రభాకరరావు ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దొంగిలించారు.
Also Read: Paddington in Peru : అందరికీ ఇష్టమైన ఎలుగుబంటి తిరిగి వచ్చింది !
చేతి ఉంగరాలు, బంగారపు కడియం రాకపోవడంతో చేతిని నరికి తీసుకువెళ్లిపోయారు. ఈ హత్య కేసులో చుక్కా రామ శ్రీనివాస్ తోపాటు ఇతని స్నేహితులు అంకోలు జగదీశ్ దుర్గా ప్రసాద్, నోముల ప్రనిత్ కుమార్ లను కలిఫి ముగ్గురిని కొవ్వూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 36 గ్రాముల బంగారం, 4 సెల్ ఫోన్లు రెండు మోటర్ సైకిల్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకరరావు హత్యకు సంబంధించిన వివరాలు కొవ్వూరు డిఎస్పి దేవకుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితులు ముగ్గురికి ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించి కొవ్వూరు మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ఈ మేరకు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించడంతో నిందితువులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.