ఏడవ రోజు కోటి దీపోత్సవంలో శ్రీ వ్రతధర రామానుజ జీయర్ స్వామి, పతంజలి యోగా మఠం సాధ్వి నిర్మలానందమయి మాతాజీ వార్లు భక్తులనుద్ధేశించి అనుగ్రహభాషణం చేయగా, బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు భక్తులను ప్రసన్నం చేసుకోవడానికి కార్తికమాసం ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి, సగుణ ధ్యానం గురించి ప్రవచనామృతం చేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కార్తిక మాసం వస్తుందంటే తనకు కోటి దీపోత్సవం గుర్తొస్తుందని, ఈ…
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భక్తిటీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవం వేడుకలు తుది దశకు చేరుకున్నాయి. నవంబర్ 12న ప్రారంభమైన ఈ వేడుకలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఈ కోటి దీపోత్సవ వేడుకలు ఆరంభం నుంచి వైభవోపేతంగా నిర్వహించబడుతున్నాయి. నేడు కార్తిక సోమవారాన్ని పురస్కరించుకొని కోటి దీపోత్సవ వేడుకల్లో 11వ రోజు సందర్భంగా విశేషాలు చూద్దాం.. ముందుగా శ్రీశ్రీ రవిశంకర్ గూరూజీచే అనుగ్రహ భాషణం. అనంతరం శ్రీనండూరి శ్రీనివాస్‌చే ప్రవచనామృతం నిర్వహించనున్నారు.…
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న భక్తిటీవీ కోటి దీపోత్సవం కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తోంది. కన్నుల పండువగా జరుగుతున్న ఈ కార్యక్రమం ఇవాళ్టికి 10వ రోజుకు చేరింది. ఆదివారం కావడంతో ఈరోజు జరిగిన కోటి దీపోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈరోజు కోటి దీపోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారి ఆధ్వర్యంలో ప్రవచనామృతం…
భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో కన్నుల పండువగా జరుగుతున్న కోటి దీపోత్సవం కార్యక్రమం 10వరోజుకు చేరింది. 10వ రోజు జరిగిన కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్రమం తప్పకుండా వైభవంగా నిర్వహించడం అంత సులువేమీ కాదని.. కానీ అసాధ్యాన్ని నరేంద్ర చౌదరి సుసాధ్యం చేశారని కిషన్‌రెడ్డి కొనియాడారు. అంతేకాకుండా…
కార్తికమాసాన ఎంతో ప్రతిష్టాత్మకంగా భక్తిటీవీ నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. నవంబర్ 12వ తేదీన ప్రారంభమైన ఈ వేడుకలు 22న ముగియనున్నాయి. నేడు 10వ రోజును పురస్కరించుకొని విశేషాలను చూద్దాం.. విశాఖపట్నం శారదా పీఠం శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి, శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి వార్లచే అనుగ్రహ భాషణం. బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మచే ప్రవచనామృతం. అనంతరం ఏడుకొండల్లో కొలువుదీరిన కోనేటి రాయుడు తిరుమల శ్రీనివాస కల్యాణోత్సవం నేత్రపర్వంగా జరుగనుంది. ఆ తరువాత భక్తులను…
భక్తిటీవీ సగర్వంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం వేడుకలు అంబరాన్నంటాయి. ఈ నెల 12 నుంచి 22 వరకు జరుగుతున్న కోటి దీపోత్సవం వేడుకలు నేడు 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు కార్యక్రమాలను ఓ సారి చూద్దామా.. సుందరంగా అలకంరించిన వేదికపైన మైసూరు అవధూతపీఠం పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారిచే అనుగ్రహ భాషణం. బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావుచే ప్రవచనామృతం. అనంతరం కొల్పపూర్ శ్రీమహాలక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన వేదికపైనే కాకుండా భక్తులతో కూడా ఈ…