భక్తిటీవీ సగర్వంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం వేడుకలు అంబరాన్నంటాయి. ఈ నెల 12 నుంచి 22 వరకు జరుగుతున్న కోటి దీపోత్సవం వేడుకలు నేడు 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు కార్యక్రమాలను ఓ సారి చూద్దామా.. సుందరంగా అలకంరించిన వేదికపైన మైసూరు అవధూతపీఠం పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారిచే అనుగ్రహ భాషణం. బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావుచే ప్రవచనామృతం.
అనంతరం కొల్పపూర్ శ్రీమహాలక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన వేదికపైనే కాకుండా భక్తులతో కూడా ఈ కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆ తరువాత వైభవోపేతంగా యాదాద్రి శ్రీలక్ష్మీనృసింహ స్వామి వారి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. అనంతరం భక్తులను ఆశీర్వదించేందుకు స్వామివార్లను కోటి దీపోత్సవం వేదిక ప్రాంగణంలో ఊరేగించనున్నారు. ఇక భక్తులు వెలిగించే దీపాల మధ్య త్రినేత్రుడి దర్శనం నేత్రపర్వంగా జరుగనుంది.
స్వర్ణ లింగోద్భవ సన్నివేశం చూసేందుకు రెండు కన్నులు చాలవేమో అనిపించే విధంగా జరుగనుంది. స్వామి వారికి నిర్వహించి సప్తహారతి వీక్షణం సర్వపాపహరణమనే చెప్పాలి. ఈ కార్యక్రమాలను చూసి మహద్భాగ్యాన్ని పొందాలంటే ఓసారి వెళ్లాల్సిందే. ఎన్టీఆర్ స్టేడియంలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా కలదు. ఇంకేందుకు ఆలస్యం.. రండి తరలిరండి.. దర్శించి పునీతులవ్వండి. 8వ రోజు కోటి దీపోత్సవం కోసం కింది వీడియోని వీక్షించండి.