ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భక్తిటీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవం వేడుకలు తుది దశకు చేరుకున్నాయి. నవంబర్ 12న ప్రారంభమైన ఈ వేడుకలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఈ కోటి దీపోత్సవ వేడుకలు ఆరంభం నుంచి వైభవోపేతంగా నిర్వహించబడుతున్నాయి. నేడు కార్తిక సోమవారాన్ని పురస్కరించుకొని కోటి దీపోత్సవ వేడుకల్లో 11వ రోజు సందర్భంగా విశేషాలు చూద్దాం.. ముందుగా శ్రీశ్రీ రవిశంకర్ గూరూజీచే అనుగ్రహ భాషణం. అనంతరం శ్రీనండూరి శ్రీనివాస్‌చే ప్రవచనామృతం నిర్వహించనున్నారు. ఆ తరువాత శివలింగానికి కోటి రుద్రాక్షల అర్చన వేదికపైనే కాకుండా భక్తులచే అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
అనంతరం కొరిన కోర్కెలు తీర్చే కోడె మొక్కల స్వామి వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి కల్యాణోత్సవం కన్నుల పండువగా జరుగనుంది. ఆ తరువాత నందివాహానంపై స్వామివార్లను భక్తులను ఆశీర్వదించేందుకు వేదిక ప్రాంగాణంలో ఊరేగించనున్నారు. కోటి దీపోత్సవ వేడుకకే తలమానికమైన దీపార్చన కార్యక్రమం వేదికతో పాటు ప్రాంగణంలో భక్తులు వెలిగించనున్న దీపాలతో దేదీప్యమానంగా వెలుగొందనుంది. ఓం నమఃశివాయ.. హరహర మహాదేవ.. శంభో శంకర.. నాదాలతో వేదిక ప్రాంగణం మారుమోగుతున్న వేళ స్వర్ణ లింగోద్భవ సన్నివేశం.. ఆహా.. ఏం చెప్పమంటారు.. ఆ అనుభూతిని అక్కడికి వెళ్లి అనుభవించడమే కానీ.. చెప్పడం వీలుకాదు.. స్వామి వారికి నివేదించే నాగ, నంది, నక్షత్ర, బిల్వ, రుద్ర, కుంభ, సింహా హరతులను వీక్షించి సర్వపాపాలను తొలగించుకోవాలంటే కోటి దీపోత్సవం వేడుకల్లో పాల్గొనాల్సిందే.
Also Read : What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే…
కోటి దీపోత్సవ వేడుకలు ఆద్యంతం ఆధ్యాత్మిక భావనతో అలరారుతున్నాయి. కార్తికమాసన ఇలలో కైలాస దర్శనం చేయాలంటే.. ఇలకైలాసం కోటిదీపోత్సవ వేడుకలకు రండి.. తరలిరండి.. దర్శించండి.. తరించండి.. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో.. వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యం కూడా కల్పించారు. 10వ రోజు కోటి దీపోత్సవ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు క్రింద వీక్షించండి.