భక్తిటీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవం వేడుక ఈ సంవత్సరం కూడా భక్తకోటిని ఆధ్యాత్మిక చింతనలో ముంచెత్తుతోంది. నవంబర్ 12వ తేదిన అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ కోటి దీపోత్సవ వేడుక నేడు 8వ రోజుకు చేరుకుంది. ఈ రోజు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని విశేషాలను చూద్దాం.. బ్రహ్మశ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుచే ప్రవచనామృతం. అనంతరం మొట్టమొదటిసారిగా ఉజ్జయిని అర్చకులచే మహాకాళేశ్వర భస్మహారతి, బిల్వార్చన కార్యక్రమం వేదికపైనే కాకుండా భక్తులచే కూడా నిర్వహించనున్నారు. ఆ…
భక్తిటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమం దిగ్విజయంగా ఆరో రోజుకు చేరింది. కార్తీక మాసాన హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమం వేలాది మంది భక్తుల సమక్షంలో కన్నుల పండువగా జరుగుతోంది. ఆరోరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ బీజేపీ నేత లక్ష్మణ్ హాజరయ్యారు. ఆయనకు వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఈరోజు కార్యక్రమంలో ముందుగా శంఖారావం పూరించిన తర్వాత హైదరాబాద్ రామకృష్ణమఠానికి చెందిన శ్రీశితికంఠానంద స్వామి, రాజమహేంద్రవరం రామకృష్ణమఠానికి చెందిన శ్రీవినిశ్చలానంద స్వామి,…
శివకేశవులు ఇద్దరు కాదు.. ఒక్కటే అనే దానికి నిదర్శనం ఈ రోజు కోటి దీపోత్సవంలో జరిగి కళ్యాణమహోత్సవమే. క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం శ్రీతులసీదామోదర కళ్యాణంతో పాటు ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ-గంగ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణం కన్నులపండువగా సాగింది. కోటి దీపోత్సవ వేదికపైన ఉన్న సాంబయ్యను పెళ్లిచేసుకునేందుకు కదిలి వచ్చిన బెజవాడ దుర్గమ్మ కు జేజేలు అంటూ భక్తులను ఉద్దేశించి అర్చకులు వేదమంత్రోత్చరణల నడుమ స్వామి వార్ల కళ్యాణం జరిపించారు. ముందుకు వైంకుఠాధీశుడు శ్రీతులసీదామోదర కళ్యాణం…
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారత దేశంలోనూ భక్తి టీవీ కోటిదీపోత్సవానికి విశేష ప్రాధాన్యత వుంది. కోటి దీపోత్సవం మొదటి రోజు నిర్వహించిన మహా శివలింగానికి అభిషేకం కనుల పండువగా సాగింది. భక్తి టీవీ కోటి దీపోత్సవం నవంబర్ 12 న అంగరంగ వైభవంగా ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభం అయింది. ఈనెల 22 వరకు కొనసాగనుంది. ప్రతి రోజూ సాయంత్రం 5:30 గంటలకు కోటి దీపోత్సవ కాంతులు భక్తజనకోటిపై ప్రసరించనున్నాయి. ప్రతీ రోజు భక్తులు స్వయంగా విశేష…