ఏడవ రోజు కోటి దీపోత్సవంలో శ్రీ వ్రతధర రామానుజ జీయర్ స్వామి, పతంజలి యోగా మఠం సాధ్వి నిర్మలానందమయి మాతాజీ వార్లు భక్తులనుద్ధేశించి అనుగ్రహభాషణం చేయగా,

బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు భక్తులను ప్రసన్నం చేసుకోవడానికి కార్తికమాసం ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి, సగుణ ధ్యానం గురించి ప్రవచనామృతం చేశారు.

ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కార్తిక మాసం వస్తుందంటే తనకు కోటి దీపోత్సవం గుర్తొస్తుందని, ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిపిస్తున్న భక్తిటీవీ, ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి ని అభినందించారు.

మరొక అతిథిగా విచ్చేసిన తెలంగాణ జస్టిస్ న్యాయమూర్తి జి. శ్రీదేవి ఈ కోటి దీపోత్సవానికి రాకపోయుంటే చాలా చింతించేదాన్నని ప్రశంసించారు.


వీటితో పాటు వేదికపై కోరిన కోరికలు తీర్చే శ్రీ వేంకటేశ్వర స్వామి ముడుపుల పూజ, భక్తులచే శ్రీ వేంకటేశ్వర విగ్రహాలకు ముడుపుల పూజ, ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర కల్యాణం, గరుడ వాహన సేవలు జరిగాయి. ఇవికాక ప్రతిరోజూ జరిగే జ్యోతి ప్రజ్వలన, బంగారు లింగోద్భవం, మహా నీరాజనం, వచ్చిన అతిథులకు గురు వందనం, గౌరవ సత్కారాలు, సప్త హారతి వంటి కార్యక్రమాలు జరిగాయి.


