ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల నాయకులు చేరికలు భారీగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మహేశ్వరం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన దాసర్లపల్లి గ్రామానికి చెందిన ఉప్పల మహేందర్.. మహేశ్వరం BSP అభ్యర్ధి కొత్త మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు.
స్థానికేతరులైన చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల అన్నయ్య కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డిలను మన నియోజకవర్గం నుంచి చిత్తుచిత్తుగా ఓడించి తరిమికొట్టాలని బహుజన్ సమాజ్ పార్టీఎమ్మెల్యే అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు.
బీఎస్పీ అభ్యర్ధి కొత్త మనోహర్ రెడ్డి ఆయన సతీమణి కొత్త సరితా రెడ్డి గడప గడప ప్రచారం నిర్వహిస్తూ ఏనుగు గుర్తుకు ఓటు వేసి కొత్త మనోహర్ రెడ్డిని గెలిపించాలని మహిళలను ఆమె కోరారు.
బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి మహేశ్వరం నియోజక వర్గంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే, నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం 9:30 నుండి రాచాలుర్ గ్రామంలో ప్రచారం ప్రారంభించి భేగంపేట్, గూడూరు, మాల గూడూరు, బేగరి కంచే, మీర్ఖన్ పేట్ ఆకుల మైలారం, పలు గ్రామాల్లో కొత్త మనోహర్ రెడ్డి ర్యాలీ
నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం 9:30 నుండి రాచాలుర్ గ్రామంలో ప్రచారం ప్రారంభించి భేగంపేట్, గూడూరు, మాల గూడూరు, బేగరి కంచే, మీర్ఖన్ పేట్ ఆకుల మైలారం, పలు గ్రామాల్లో కొత్త మనోహర్ రెడ్డి ర్యాలీగా పర్యటించనున్నారు.
మహేశ్వరం నియోజకవర్గంలో ఏనుగు పార్టీ దూసుకుపోతుంది. నియోజకవర్గంలో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డికి స్థానిక ప్రజలు కేఎంఆర్ ట్రస్ట్ లబ్ధిదారులు, మహిళలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు బ్రహ్మరథం పడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేయాలని రాహుల్ గాంధీకి, మల్లికార్గున ఖర్గేకు కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత కొత్త మనోహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వివరణ తీసుకోకుండా సస్పెండ్ చేయడంపై ఆయన మీడియా సమావేశంలో మండిపడ్డాడు.