కాంగ్రెస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేయాలని రాహుల్ గాంధీకి, మల్లికార్గున ఖర్గేకు కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత కొత్త మనోహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వివరణ తీసుకోకుండా సస్పెండ్ చేయడంపై ఆయన మీడియా సమావేశంలో మండిపడ్డాడు. ఐదు ఎకరాల పొలం, పది కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పుకుంటున్న చిగురింత పారిజాత నరసింహారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Also: Eesha Rebba: బికినీ అందాలతో పిచ్చెక్కిస్తున్న తెలుగు భామ.. ఆఫర్స్ కోసమేనా?
మహేశ్వరం టికెట్ కోసం డబ్బులు తీసుకోలేదని రేవంత్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలు ఆవాస్తవము అని నిరూపించుకోవాలంటే చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేయాలని కొత్త మనోహర్ రెడ్డి సవాలు విసిరారు. నా వ్యాఖ్యలను వక్రీకరించి.. కాంగ్రెస్ పార్టీలో నాతో పాటు పోటీ చేయాలనుకుంటున్నా వ్యక్తులు కుట్ర చేశారని ఆయన తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంతో పాటు రేవంత్ రెడ్డి ఏఏ నియోజకవర్గంలో పోటీ చేసిన ఆయనపై నిలబడడానికి సిద్ధంగా ఉన్నానని కొత్త మనోహర్ రెడ్డి వెల్లడించాడు. నా వ్యాఖ్యలపై వివరణ తీసుకోకుండా గంటల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేయడం అన్యాయం అని కొత్త మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తల అభిప్రాయం తీసుకొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకనే ఈ విధంగా నాపై కుట్ర చేశారని కొత్త మనోహర్ రెడ్డి వ్యాఖ్యానించారు.