నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు చకచకా మారుతున్నాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని టీడీపీ నేతలు మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, వేమిరెడ్డి పట్టాభి కలిశారు. కోటంరెడ్డి నివాసంలో సుధీర్ఘ చర్చలు నిర్వహించారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రూరల్ పరిధిలోని గాంధీనగర్‌లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరుతూ ఆయన నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి సస్పెండైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నగరంలోని మాగుంట లేఔట్‌లోని నివాసం నుంచి బయటకు వెళ్లకుండా ఆయన్ను అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో తన ఇంటి వద్దే కోటంరెడ్డి బైఠాయించి నిరసన తెలిపారు.
Kotamreddy Sridhar Reddy: ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాకరేపుతున్నాయి.. 7 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. అనూహ్యంగా ఓ స్థానాన్ని 23 ఓట్లతో టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం సాధించారు.. దీంతో, అధికార వైసీపీకి షాక్ తగిలింది.. ఆరు స్థానాలకే పరిమితం అయ్యింది.. ఇక, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన ఎమ్మెల్యేలు అంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై సస్పెన్షన్ వేటు…
Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైసీపీ నెల్లూరు అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర రావుతో పాటు రఘు, జావేద్‌లను అరెస్ట్ చేశారన్న ఆయన.. షాడో ముఖ్యమంత్రి సజ్జల ఆదేశాల మేరకే ఈ అరెస్టులు జరుగుతున్నాయని ఆరోపించారు.. అన్ని అంశాలు వదిలి నెల్లూరు రూరల్‌పై సజ్జల దృష్టి పెట్టారని మండిపడ్డారు.. అరెస్ట్‌లపై పోలీసులు సరైన సమాచారం ఇవ్వలేదన్నారు.. నేను వేదాయపాలెం స్టేషన్‌కు వెళ్తే.. అక్కడ వెంకటేశ్వరరావు లేకపోవడంతో పోలీసులను…
Kotamreddy Sridhar Reddy: నిధుల కోసం అర్థించినా, అభ్యర్థించినా ప్రయోజనం లేదు.. అందుకే ప్రశ్నించా అంటున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. ఈ రోజు కోటంరెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీల నిరసన సదస్సు జరిగింది.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరోసారి ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు.. నెల్లూరు రూరల్ లో మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదని ఆరోపించిన ఆయన.. బారా షాహిద్ దర్గా అభివృద్ధికి రూ.13 కోట్లకు ముఖ్యమంత్రి…
Rama Siva Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కలకలం సృష్టించాయి.. అయితే, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు విషయాన్ని బయటపెట్టారు కోటంరెడ్డి స్నేహితుడు.. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఇవాళ మీడియాతో మాట్లాడారు కోటంరెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి.. ట్యాపింగ్ ఆరోపణలను ఖండించారు. ఇది ట్యాపింగ్ కాదని స్పష్టం చేశారు.. నా ఫోన్ కేంద్ర హోంశాఖకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపడానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు రామశివారెడ్డి.. అది ట్యాపింగ్ ఆడియో…