Kotamreddy Sridhar Reddy: ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాకరేపుతున్నాయి.. 7 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. అనూహ్యంగా ఓ స్థానాన్ని 23 ఓట్లతో టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం సాధించారు.. దీంతో, అధికార వైసీపీకి షాక్ తగిలింది.. ఆరు స్థానాలకే పరిమితం అయ్యింది.. ఇక, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన ఎమ్మెల్యేలు అంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇదే సమయంలో.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్లు, రూ.20 కోట్లు ఇచ్చారని ఆరోపించారు సజ్జల రామకృష్ణారెడ్డి.. అయితే, ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. వైసీపీ కామెంట్లపై ఘాటుగా స్పందించారు..
Read Also: Mekapati Chandra Sekhar Reddy: స్పెన్షన్ సంతోషం.. రూ.20 కోట్లు ఇచ్చారని సజ్జల ప్రమాణం చేస్తారా?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ కానీ, టీడీపీ కానీ.. నన్ను ఓటు అడగలేదన్నారు కోటంరెడ్డి.. ఆత్మప్రబోధానుసారం ఓటు వేస్తాను అని చెప్పా.. ఆ మేరకు ఓటు వేశానని తెలిపారు.. ఇదే సమయంలో.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను మీరెన్ని కోట్లకు కొన్నారు సజ్జల అంటూ నిలదీశారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. అయితే, చేతిలో అధికారం ఉందని సస్పెండ్ చేశారు.. కనీసం షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేశారని మండిపడ్డారు…. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం.. పార్టీలో పెత్తందారీ విధానం నడుస్తోందని వ్యాఖ్యానించారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి..