Kotamreddy Sridhar Reddy : సస్పెండ్ చేసినా.. సమస్యలను ప్రజా కోర్టులో ప్రస్తావిస్తూనే ఉంటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర శాసనసభ నుంచి తనను సస్పెండ్ చేసినా తాను సమస్యలను ప్రజా కోర్టులో ప్రస్తావిస్తూనే ఉంటానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ కు నిరసనగా కార్యాలయంలో మాక్ అసెంబ్లీని నిర్వహించారు. నెల్లూరు రూరల్ లో ప్రజా సమస్యల పరిష్కారానికి నాలుగేళ్ల నుంచి పోరాడుతున్నా ఫలితం లేదన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ఇచ్చిన జీవోలకు దిక్కు లేకుండా పోయిందని ..ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో పనులన్నీ ఆగిపోయాయని అన్నారు.. సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తూనే ఉంటానని కోటంరెడ్డి స్పష్టం చేశారు. శాంతియుతంగా గాంధీగిరి తరహలో నిరసన తెలియజేస్తుంటే అడ్డుకున్నారని, అసెంబ్లీకి ప్లకార్డు పట్టుకెళ్తుంటే..పీకేశారని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యలు తెలియజేయడానికి నాకు మైక్ ఇవ్వలేదని, నన్ను తిట్టేందుకు 40 నిమిషాలు మంత్రులకు మైకు ఇచ్చారని ఆయన మండిపడ్డారు. నా పేపర్ సైతం దౌర్జన్యంగా లాక్కున్నారని, ఇదేంటని ప్రశ్నించిన నన్ను.. మార్షల్స్ తో బయటకు పంపి సస్పెండ్ చేశారన్నారు. నేను మాట్లాడాలి అనుకున్నది మాక్ అసెంబ్లీ ద్వారా తెలియజేస్తానని, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని సమస్యలను మాక్ అసెంబ్లీ ద్వారా స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
Also Read : Bus Accident: బంగారం తవ్వడానికి వెళ్తుండగా బస్సు బోల్తా.. 17 మంది దుర్మరణం
Also Read
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
అర్జీ ఇస్తే పరిష్కరిస్తామని ఆర్ధిక మంత్రి చెప్పడం హాస్యాస్పదమని ఆయన విమర్శించారు. నా దగ్గర ముఖ్యమంత్రి ఇంపార్టెంట్ అని 2021లో సంతకాలు పెట్టిన అర్జీలు ఉన్నాయని, రెండు సంవత్సరాలు గడుస్తున్నా ముఖ్యమంత్రి సంతకాలు పెట్టిన ఫైల్స్ కి దిక్కులేదని ఆయన అన్నారు. ఇప్పుడు అర్జీలు ఇస్తే ఆరు నెలల్లో ఏమి చేస్తారని ఆయన అన్నారు. నా మీద పరుష పదజాలం వాడిన 5 మంది మంత్రుల పై సమాధానాలు చెప్పాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన జీవోకి.. టెండర్లు పిలిచినా.. నిధులకు అనుమతులు లేక పనులు ఆగిపోయాయన్నారు. ఓ శాసనసభ్యుడిగా ఇంతకంటే ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. కాళ్లు నొప్పులతో నాలుగు గంటల పది నిమిషాలు అసెంబ్లీలో నిలుచున్నా మైక్ ఇవ్వలేదని, నా రూరల్ నియోజకవర్గ సమస్యల కోసం ఆర్జించా, రికివెస్ట్ చేసాను.. ఇక ఉద్యమం తప్పదన్నారు. రూరల్ సమస్యల పరిష్కారానికి శాసనసభ్యుడిగా నేను చేస్తున్న ప్రయత్నాన్ని గమనించాలన్నారు.
Also Read : Midhunam: టాలీవుడ్ లో మరో విషాదం…
తాజావార్తలు
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయ సినిమా స్టార్ట్
-
CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
ట్రెండింగ్
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..