Kotamreddy Sridhar Reddy: నిధుల కోసం అర్థించినా, అభ్యర్థించినా ప్రయోజనం లేదు.. అందుకే ప్రశ్నించా అంటున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. ఈ రోజు కోటంరెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీల నిరసన సదస్సు జరిగింది.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరోసారి ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు.. నెల్లూరు రూరల్ లో మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదని ఆరోపించిన ఆయన.. బారా షాహిద్ దర్గా అభివృద్ధికి రూ.13 కోట్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపినా.. ఆర్థికశాఖ నిధులు విడుదల చేయలేదని విమర్శించారు.. ముస్లిం గురుకుల పాఠశాల భవన నిర్మాణం తెలుగుదేశం పార్టీ హయాంలోనే మొదలైన నేను కూడా పూర్తి చేయలేకపోయానన్న ఆయన.. నిధులు ఎప్పుడు అడిగినా లేవనే చెబుతున్నారని మండిపడ్డారు.
Read Also: Chetan Sharma Resigns: స్టింగ్ ఆపరేషన్ ఎఫెక్ట్.. బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ రాజీనామా
షాది మంజలి నిర్మాణం కూడా అర్ధాంతరంగా ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి.. ఈ సమస్యల మీద గట్టిగా మాట్లాడుతున్నానని నన్ను అవమానించారు.. ఫోన్ ట్యాపింగ్ చేసి ఆవేదనకు గురిచేశారన్నారు. నిధుల కోసం అర్థించినా, అభ్యర్థించినా ప్రయోజనం లేదు.. అందుకే ప్రభుత్వాన్ని ప్రశ్నించానని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని హెచ్చరించిన ఆయన.. ఒక ప్రభుత్వం చేసిన పనిని మరో ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదని హితవుపలికారు. టిడ్కో ఇళ్ల విషయంలో కూడా ఇదే జరిగిందన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. కాగా, కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపాయి.. ఆ తర్వాత నెల్లూరు రూరల్ వైసీపీ ఇంచార్జ్‌గా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించిన పార్టీ అధిష్టానం.. ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది.. ఇక, కోటంరెడ్డిపై మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు.