Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైసీపీ నెల్లూరు అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర రావుతో పాటు రఘు, జావేద్‌లను అరెస్ట్ చేశారన్న ఆయన.. షాడో ముఖ్యమంత్రి సజ్జల ఆదేశాల మేరకే ఈ అరెస్టులు జరుగుతున్నాయని ఆరోపించారు.. అన్ని అంశాలు వదిలి నెల్లూరు రూరల్‌పై సజ్జల దృష్టి పెట్టారని మండిపడ్డారు.. అరెస్ట్‌లపై పోలీసులు సరైన సమాచారం ఇవ్వలేదన్నారు.. నేను వేదాయపాలెం స్టేషన్‌కు వెళ్తే.. అక్కడ వెంకటేశ్వరరావు లేకపోవడంతో పోలీసులను నిలదీశాను.. 24 గంటల్లో న్యాయస్థానంలో ప్రవేశ పెడతామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో నిరసన విరమించానని తెలిపారు. ఏదేమైనా నేతల అరెస్ట్ చేసిన తీరు సరికాదని హితవుపలికారు. హైవేపై రాత్రి 11.30 గంటల వరకూ తిప్పారు.. సజ్జల ఆదేశాలను పోలీసులు అమలు చేస్తున్నారని విమర్శించారు. నన్ను మానసికంగా వేధించాలని చూస్తున్నారు.. కానీ, నా అనుచరులు ఎవరూ భయపడరు.. నా డ్రైవర్ కూడా పట్టించుకోడని వార్నింగ్ ఇచ్చారు కోటంరెడ్డి.
Read Also: Income Tax survey on BBC: బీబీసీ లావాదేవీలపై ఐటీశాఖ రిపోర్ట్.. కీలక అంశాల ప్రస్తావన
విద్యార్థి దశలోనే ఆన్నీ చూశాను.. నోటీసులు ఇవ్వకుండా భయభ్రాంతులు గురిచేసే రీతిలో అరెస్ట్ చేయడం సరికాదని హితవుపలికారు కోటంరెడ్డి.. మరోవైపు, 24 గంటల్లోగా న్యాయస్థానంలో ప్రవేశ పెడతామని హామీ ఇచ్చి అమలు చేశారు.. ఈ విషయంలో పోలీసు యంత్రాంగానికి ధన్యవాదాలని పేర్కొన్నారు. నాతో పాటు పదకొండు మందిపై కేసు నమోదు చేశారు.. నాలుగు నెలల క్రితం జరిగిన ఘటన.. అప్పుడు కేసు కాదు.. కానీ, ఇప్పుడు మాత్రం కేసు ఎందుకు? అని నిలదీశారు. ఇదంతా ఎందుకు? నన్ను కూడా అరెస్ట్ చేయండి.. న్యాయ పోరాటం చేస్తాం అంటూ సవాల్ విసిరారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. ఇక, ఇవాళ మీడియాతో మాట్లాడిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..