కోనసీమ జిల్లా పేరు మార్చడం.. కోనసీమ జిల్లాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమగా పేరు మార్పు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక ఉత్తర్వులు జారీ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. నిన్న విధ్వంస ఘటనలు చోటు చేసుకున్నాయి.. అయితే, ఈ ఆందోళలనపై మండిపడ్డారు మంత్రి ఆదిమూలపు సురేష్.. అన్ని వర్గాల సూచన, కోరిక మేరకే అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చటం జరిగిందన్న ఆయన.. అంబేద్కర్ ఒక కులానికో ఒక వర్గానికో చెందిన వాడు కాదు.. అంబేద్కర్…
కోనసీమ జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.. ముఖ్యంగా అమలాపురం అయితే అష్టదిగ్భందంలోకి వెళ్లిపోయింది.. పోలీస్ పికెట్లు, భారీ గస్తీ ఏర్పాటు చేశారు.. అయితే, అమలాపురంలో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.. ఇదే సమయంలో ఇతర జిల్లాల నుండి భారీగా అమలాపురం చేరుకున్నారు పోలీసులు.. రాత్రి నుంచి అమలాపురంలో వర్షం కూడా కురుస్తుండడంతో.. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు.. అక్కడే మకాం వేసి పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఏలూరు డీఐజీ పాలరాజు..…
రాజకీయాల్లో క్రెడిట్ హైజాకింగ్ పాలసీ అని ఒకటి వుంటుంది. తమ నిర్ణయాల వల్ల అంతా మంచి జరిగితే ఆ క్రెడిట్ అంతా మావల్లే జరిగిందని, తప్పు జరిగితే అది విపక్షాల కుట్ర అని నెపం నెట్టేయడం అన్నమాట. ఏపీలో అదే జరుగుతోంది. ప్రశాంతంగా వుండే కొనసీమ రణసీమగా మారింది. కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంపై ఆందోళనలు కొనసాగుతూనే వున్నాయి. కోనసీమ జిల్లా పేరును మార్చవద్దంటూ అమలాపురంలో కోనసీమ సాధన సమితి చేపట్టిన…
కోనసీమ జిల్లా మార్పుపై అమలాపురంలో ఇప్పటికే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోనసీమ సాధన సమితి మరో నిరసనకు పిలుపునిచ్చింది. బుధవారం ఉదయం 10 గంటలకు అమలాపురం కలెక్టరేట్ సమీపంలోని నల్ల వంతెన వద్దకు భారీగా ప్రజలు చేరుకోవాలని, నిరసన చేపట్టాలని తెలిపింది. దీంతో బుధవారం ఏం జరుగుతుందనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అమలాపురంలో నిరసనకారులు మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌బాబు ఇళ్లకు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. అటు…
అమలాపురంలో పరిస్థితి చేయిదాటిపోయింది. మంత్రి విశ్వరూప్ ఇంటిని తగలబెట్టారు ఆందోళనకారులు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమలాపురం చేరుకున్నారు ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు. కోనసీమకు అదనపు బలగాలు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు డీఐజీ పాలరాజు. ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇల్లు దగ్ధం చేశారు. ఆయన ఇంటికి కూడా నిప్పంటించారు ఆందోళనకారులు. అమలాపురంలో కొనసాగుతున్న ఉద్రిక్తతతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ని వివాదాల్లోకి లాక్కూడదన్నారు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్.…
అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ యువత ర్యాలీకి దిగింది. అనుమతి లేని కారణంగా అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పోలీసులపై రాళ్లు రువ్వారు నిరసనకారులు. డిఎస్పీ మాధవరెడ్డి, ఎస్పీ గన్ మ్యాన్ కు గాయాలయ్యాయి. దీంతో లాఠీఛార్జ్ తో చెదరగొట్టారు పోలీసులు. కలెక్టరేట్ ముట్టడికి కోనసీమ జిల్లా మద్దతు దారుల రెడీ అయ్యారు. జై కోనసీమ నినాదాలతో కలెక్టరేట్ వైపు వెళ్తున్న యువతతో అక్కడ హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. అక్కడేం జరుగుతుందో…
ఏపీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లా పేరును డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమగా మారుస్తున్నట్లు ప్రభుత్వం ప్రటించింది. ఈ మేరకు ప్రిలిమినరీ ఉత్తర్వులు త్వరలోనే జారీ కానున్నాయి. రెండు నెలల కిందట జిల్లాల విభజన సందర్భంగా అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లా ఏర్పాటైంది. అయితే ఈ జిల్లాకు బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని దళిత, ప్రజాసంఘాలు, వివిధ పార్టీలు కోరుతున్నాయి. ఈ అంశంపై పలుచోట్ల నిరసన, ఆందోళన కార్యక్రమాలు కూడా చోటుచేసుకున్నాయి. Andhra Pradesh: అగ్రి…
కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం వైసిపి సంక్షోభంలో పడింది. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు వైసిపిలో ప్రాధాన్యత ఇవ్వడం, నియోజకవర్గ వైసిపి శ్రేణులకు మింగుడు పడటంలేదు. వైసిపికి రాజోలు నియోజకవర్గంలో కో – ఆర్డినేటర్ గా పెదపాటి అమ్మాజీ, మాజీ కో – ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు లను ప్రక్కన పెట్టి ఎమ్మెల్యే రాపాకకు ప్రాధాన్యత ఇచ్చారు. దీనితో వైసిపి ఆవిర్భావం నుంచి ఉన్న నేతలు డీలా పడ్డారు. ఇటీవల అమలాపురంలో జరిగిన కోనసీమ జిల్లా…
అమ్మబోతే అడవి… కొనబోతే కొరివి అన్నట్టుగా తయారైంది కొబ్బరి రైతుల దుస్థితి. కన్నకొడుకు ఆదుకున్న లేకపోయినా కొబ్బరి చెట్టు ఆదుకొంటుందని కోనసీమ వాసుల నమ్మకం. కొబ్బరి చెట్టును కల్పతరువుగా పూజిస్తారు కోనసీమ వాసులు . కొబ్బరి ఉత్పత్తుల పేరు చెబితే గుర్తొచ్చేది కేరళ తరువాత కోనసీమ కొబ్బరి మాత్రమే. గత కొన్ని ఏళ్లుగా కోనసీమ కొబ్బరి రైతులు దిగుబడి లేక నల్లి తెగుళ్ల వల్ల ఉత్పత్తి తగ్గిపోయి ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నారు. వాతావరణంలో మార్పుల వలన…
కోనసీమలో రాజకీయం రోడ్డెక్కిందా? రెండుపార్టీల క్రెడిట్ ఫైట్తో రహదారి మలుపులు తిరుగుతోందా? రోజూ ఈ మార్గంలో ప్రయాణిస్తూ.. నరకం చూస్తున్న ప్రజల వాదనేంటి? లెట్స్ వాచ్..! వైసీపీ, బీజేపీ మధ్య నిప్పు రాజేస్తున్న కోనసీమ రోడ్డు..! ఇది తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోకి ప్రవేశించే రావులపాలెం నుంచి అమలాపురం వెళ్లే ప్రధాన రహదారి. గోతులు పడి.. పూర్తిగా పాడవడంతో ఈ రోడ్డుపై ప్రయాణమంటే కోనసీమ వాసులు నరకం చూస్తున్నారు. అయితే రావులపాలెం పదహారో జాతీయ రహదారి నుంచి అమలాపురం…