వర్షాలు కురిసి గోదావరికి పెద్దమొత్తంలో నీరు చేరితే దిగువున ఉన్న కోనసీమ వరదతో అనేక ఇబ్బందులు పడుతుండేది. వేలాది ఎకరాల పంట వరదనీటికి కొట్టుకుపోయేది. ప్రస్తుతం దిగువ గోదావరిపై పోలవరం డ్యామ్‌ను నిర్మిస్తున్నారు. ఈ డ్యామ్ పూర్తికావడానికి కొంత సమయం పడుతుంది. అయితే, పోలవరం వద్ద ప్రస్తుతం కాఫర్ డ్యామ్ ను ఏర్పాటు చేయడంతో వరద ఉధృతి కొంతమేర తగ్గింది. గతంలో రాజమంత్రి తదితర ప్రాంతాలకు పెద్ద ఎత్తున వరద పోటెత్తేది. కాని, ఇప్పుడు ఆ పరిస్థితులు…
ఆంధ్రప్రదేశ్ కరోనా కోరలు చాస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ఉభయగోదావరి జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజు రోజుకు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ వినియోగం పెరుగుతున్నది. దీంతో కోనసీమలో ఈరోజు నుంచి మూడు రోజులపాటు ఆక్సిజన్ ప్లాంట్ పార్టీ నిరసన దీక్షను చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. అయితే, పోలీసులు ఈ నిరసన దీక్షకు అనుమతి…