Komatireddy Venkat Reddy: ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని రాష్ట్ర రోడ్డు రవాణా భవనాలు, సినీమాటోగ్రాఫి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇవాళ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో ఆయన పర్యటించారు.
ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజన ఏపీ విభజన చట్టం-2014 నియమనిబంధనలకు అనుగుణంగా పూర్తయినట్టు రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇరు రాష్ట్రాలకు పంపిన లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు. రెండు రాష్ట్రాల నడుమ ఆస్తుల పంపకంలో భాగంగా ఆప్షన్-జీ కి ఇరు రాష్టాలు అంగీకారం తెలపడంతో విభజన పూర్తయినట్టు కేంద్రం ఈ లేఖలో తెలిపింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటిపై ఈడీ సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కవితపై ఈడీ రైడ్స్ మ్యాచ్ ఫిక్సింగ్ అని అన్నారు. తాము రెండు సంవత్సరాల క్రితమే కవిత అరెస్టు అవుతుందని చెప్పామని తెలిపారు. మనీష్ సిసోడియా అరెస్ట్ అయినప్పుడే కవిత అరెస్టు కావాలి.. కానీ అప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. కవిత అరెస్టుతో వచ్చే సానుభూతితో మూడు నాలుగు సీట్లు సంపాదించవచ్చని…
దక్షిణ తెలంగాణలో కరువు ఛాయాలకు కేసీఆర్ పాలనే కారణమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. శ్రీశైలం స్వరంగం పనులు, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే ఈరోజు రైతులు సాగునీరు లేక ఇబ్బంది పడేవారు కాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే తెలంగాణ తెచ్చుకున్న ఆనందం కూడా లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పదేళ్ల తర్వాత పేదల కళ్లలో ఆనందం చూస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ మూడు నెలల పాలనతో అన్నీ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట పెరిగింది, బీఆర్ఎస్ ప్రతిష్ట అథ:పాతాళానికి దిగజారిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఛైర్మన్లు ఆ పార్టీని వీడటం ఆ పార్టీ భవిష్యత్తును చూపెడుతుందని, గతిలేకనే కేసీఆర్ – బీఎస్పీతో పొత్తుపెట్టుకున్నాడని ఆయన విమర్శించారు. తుంటివిరిగి…
యాదాద్రి కాదు ఇకపై యాదగిరి గుట్టనే అని వెల్లడించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్బంగా యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మారుస్తూ త్వరలోనే జీఓ ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్ తండ్రి చాటు కొడుకు అంటూ సెటైర్లు వేశారు కోమటిరెడ్డి. నేను ఉద్యమాలు చేసి వచ్చానని, నాలెడ్జ్ లేని కేటీఆర్ గురించి మాట్లాడడం వేస్ట్ అంటూ చురకలు అంటించారు. Nitish Kumar: “ప్రధాని మోడీని…
బండి సంజయ్ కి ఏం తెలియదని, ఆయన ని అంత సీరియస్గా తీసుకోకండి అంటూ వ్యాఖ్యానించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా ఆస్తులపై విచారణకి సిద్ధమన్నారు. అంతేకాకుండా.. అవినీతిపరుడైన వ్యక్తి నిజాయితీ గల మీద ఆరోపణలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో మోడీ చర్యలు దుర్మార్గమని ఆయన విమర్శించారు. ప్రభుత్వాలు కూల్చడం దుర్మార్గమని, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ..…
Komatireddy Venkat Reddy: ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్చెరు సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఓఆర్ఆర్ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. ఇవాళ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి.. మాటలు అవమానించే విధంగా ఉన్నాయన్నారు. భువనగిరి ఖిల్లా మీద రోప్ వే వేసుకుందాం అని 200 కోట్లు అడిగానని.. కిషన్ రెడ్డి కనీసం స్పందించలేదని ఆయన మండిపడ్డారు. నాలుగు ఏండ్ల నుండి ఫైల్ దగ్గర పెట్టుకున్నాడని, సొంత రాష్ట్రానికి 200 కోట్లు తెచ్చుకోలేక పోయాడని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి కాంగ్రెస్ మీద మాట్లాడటం…