Komatireddy Venkat Reddy: ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని రాష్ట్ర రోడ్డు రవాణా భవనాలు, సినీమాటోగ్రాఫి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇవాళ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో ఆయన పర్యటించారు. గూడూరు, వెంకటాద్రిపాలెం గ్రామాలలో నూతనంగా నిర్మించిన ఆలయాలలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందిస్తామన్నారు. ధాన్యానికి రైస్ మిల్లర్స్ మద్దతు ధర చెల్లించకుంటే మిల్లులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇది ప్రజా ప్రభుత్వం, రైతు ప్రభుత్వం…. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. ప్రభుత్వం రైస్ మిల్లర్లను అన్ని రకాలుగా ఆదుకున్నప్పుడు రైతులకు మేలు చేయడానికి ప్రయత్నం చేయాలన్నారు.
Read also: Peddireddy Ramachandra Reddy: చంద్రబాబు రాజకీయ వికలాంగుడు.. మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
లేకుంటే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం రైతులను నిండా ముంచింది. వడగళ్లు, గాలులతో కూడిన వర్షానికి చేతి కొచ్చిన పంటలు నేలరాలాయి. ఇక సిరికొండ మండలంలోని లఖంపూర్ గ్రామంలో రేకులు కొట్టుకు పోయి గాలికి పంట నేలరాలింది. రాంపూర్ గ్రామంలో జొన్న, మొక్క జొన్న, గోధుమ, పంటలు గాలికి నేలకొరిగాయి. కొమురం భీం జిల్లా బెజ్జూర్ లో భారీ వర్షంతో కల్లాల్లోని మిర్చిపంట తడిసిపోయింది. కొమురం భీం జిల్లా బెజ్జూర్ లో 72.8 మీ మీ వర్షపాతం నమోదైంది. లోనవెల్లి లో 39.5 మీ మీ. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ లో 29.5 మీ.మీ వర్షపాతం నమోదైంది.
Loksabha Elections 2024 : 21 మంది లోక్ సభ అభ్యర్థులను ప్రకటించిన డీఎంకే