సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రోడ్లు, భవనాలు, రైల్వే బ్రిడ్జిలు, సినిమా పరిశ్రమకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల ప్రతిపాదనలపై ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రోడ్లు, భవనాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం కేటాయింపులు పేపర్లలో చూపించి, చెల్లింపులు చేయని కారణంగా చిన్న కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని.. పదిసార్లు టెండర్లు పిలిచినా, పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి…
నల్లగొండ పట్టణంలో మున్సిపల్ రోడ్ల నిర్మాణంకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ మున్సిపాలిటీనీ మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఆయన వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. UPSC…
Komatireddy: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో దివంగత జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
ఆరు గ్యారంటీలు, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవాళ ఆయన నల్గొండ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. అధికారం కోల్పోయాక సహనం కోల్పోయిన బీఆర్ఎస్ నేతలు ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అర్హులకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందుతాయని ఆయన వెల్లడించారు. ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తాం… బిఆర్ఎస్ నేతలు చూస్తూ కూర్చోండని ఆయన వ్యాఖ్యానించారు. 5 సంవత్సరాలలో అందరూ ఆశ్చర్యపోయే రీతిలో అబివృద్ది చేస్తామని, గత ప్రభుత్వ…
నల్గొండ జిల్లా రైతాంగానికి సాగునీళ్లు అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు సచివాలయంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన సమీక్షలో.. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను త్వరతగతిన పూర్తిచేసేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి ఇద్దరు మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
“న్యాయమైన హక్కును సాధించే వరకు” పోరాటం చేస్తామంటూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించిన రెండో విడత భారత్ జోడో యాత్ర ఈ నెల 14న మణిపూర్ లో ప్రారంభమై ముంబై వరకు సాగుతుందని రోడ్లు భవనాల శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
రోడ్ల నిర్మాణంలో ఎక్కడా అలసత్వానికి తావు లేకుండా, నాణ్యతలో రాజీపడకుండా రోడ్లు నిర్మించి.. ప్రమాదరహిత తెలంగాణ దిశగా విస్తృతంగా పనిచేయాలని.. ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో జాప్యం జరగకుండా ప్రతీ ఒక్క ప్రాజెక్టుకు ఒక సీఈ స్థాయి అధికారిని స్పెషల్ ఆఫీసర్ గా పెట్టి పనులను మానిటరింగ్ చేయాలని అధికారులకు రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. ఇవ్వాల సచివాలయంలోని తన ఛాంబర్ లో రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా నిర్వహించిన…
Komatireddy Venkat Reddy: కేసీఆర్ ఘనతలు మాకన్నా.. ప్రజలకే ఎక్కువ తెలుసు అని రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా మాజమంత్రి జగదీష్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ అనేది పచ్చి అబద్ధం అని కోమటిరెడ్డి చెప్పారు.
Komatireddy Venkat Reddy Inspected AP Bhavan in Delhi: ఢిల్లీలోని ఉమ్మడి ఏపీ భవన్ విభజనపై నేడు సమీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో అధికారులతో కలిసి ఏపీ భవన్ ప్రాంగణాన్ని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఏపీ తెలంగాణ భవన్ విభజనలో ఇప్పటికే చాలా ఆలస్యం అయిందన్నారు. రెండు రాష్ట్రాల మధ్య విభజనలు వివాదం కూడా పెద్దగా ఏమీ లేదని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. కొత్త భవనం కోసం మార్చి లోగా…