Bhatti Vikramarka: మహాలక్ష్మిగా కీర్తించే మహిళలు బస్సులో ప్రయాణిస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: మహాలక్ష్మిగా కీర్తించే మహిళలు గౌరవంగా బస్సులో ప్రయాణిస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల ప్రారంభోత్సవంలో TSRTC ఎండీ సజ్జ నార్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే దానం నాగేందర్, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు 50% ఎరియర్ బాండ్స్ నీ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో ఆర్టీసీ సిబ్బంది జీతాలకి కోసం చాలా ఇబ్బంది పడేవారని అన్నారు. ఆర్టీసీ ఆస్తులను కోల్పోతుందనే ఆందోళన ఉండేదని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు భావ ప్రకటన స్వేచ్చ ఉండేది కాదన్నారు. 25 ఎలక్ట్రిక్ బస్సులను ఈరోజు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో సింగరేణి, ఆర్టీసీ సంస్థల్లోనే వేల సంఖ్యలో ఉద్యోగులు ఉంటారన్నారు. TSRTC అభివృద్ధి కి ప్రభుత్వ సహాయం అందుతూనే ఉంటుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకుంటుందని తెలిపారు. మహాలక్ష్మిగా కీర్తించే మహిళలు గౌరవంగా బస్సులో ప్రయాణిస్తున్నారని తెలిపారు. మహిళల టికెట్ డబ్బులను ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు. ఒక కార్మికుడిలా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అభివృద్ధి కృషికి చూస్తున్నారని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, గృహ జ్యోతి, మహాలక్ష్మి పథకాలను మూడు నెలల్లోనే అమలు చేశామని అన్నారు.
Read also: Haryana: హర్యానా సీఎం రాజీనామా.. కారణం అదే..?
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
TSRTC ఎండీ సజ్జ నార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం సహకారంతో TSRTC అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 75 ఎలక్ట్రిక్ బస్సులున్నాయని తెలిపారు. 22 ఎలక్ట్రిక్ బస్సులను ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. మరో 150 ఎలక్ట్రిక్ బస్సులు జూన్ వరకు వస్తాయన్నారు. ఇక ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సులు రావాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ టూరిస్ట్ ప్లేస్ గా వృద్ది చెందుతుందన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు టూరిజం డెవలప్మెంట్ కి ప్రోత్సాహంగా ఉంటాయన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి, ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుందన్నారు. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని తెలిపారు. ప్రైవేట్ బస్సుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయన్నారు. గ్రామాల్లో బస్సులు రావాల్సిన అవసరం ఉందన్నారు. బస్సులు లేక స్కూల్ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
Haryana: హర్యానా సీఎం రాజీనామా.. కారణం అదే..?
తాజావార్తలు
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!