కరోనా మహమ్మారి విజృభిస్తున్నప్పటి నుండి ఇప్పటివరకు తెలంగాణాలో 100 మంది జర్నలిస్టులు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. దేశం మొత్తంలో దాదాపు పదిహేను రాష్ట్రాలలో జర్నలిస్టులను “ఫ్రంట్ లైన్ వారియర్స్ ” గా గుర్తించారని… వారికి ప్రత్యేకంగా బెడ్లు కేటాయించి, ఉచిత వైద్యం రాష్ట్ర ప్రభుత్వాలు చేయిస్తున్నాయని వెల్లడించారు. కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఇతర రాష్ట్రాలు ఆర్ధిక సహాయం కూడా చేస్తున్నాయని… కాబట్టి కరోనాతో మృతి చెందిన…