ప్రధాని మోడీ, అమిత్ షా... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అప్పనంగా కట్టబెట్టిన రూ. 18 వేల కోట్లు.. మునుగోడు, నల్గొండ నియోజకవర్గాల అభివృద్ధికి ఇవ్వండి... అలా చేస్తే తాము ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకుంటామని ప్రకటించారు మంత్రి జగదీష్ రెడ్డి
పూటకో మాట కోమటిరెడ్డి బ్రదర్స్ నైజం అని మంత్రి జగరదీశ్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. రాజ్ గోపాల్ రెడ్డి అమ్ముడుపోయిన వ్యవహారంను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నామని అన్నారు. 20వేల కోట్ల కాంట్రాక్టులు తీసుకున్నట్టు రాజ్ గోపాల్ రెడ్డి ఒప్పుకున్నారని గుర్తు చేశారు జగదీశ్ రెడ్డి.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం మునుగోడు ఉపఎన్నిక. నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్లు తక్షణమే ప్రారంభమవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం పేర్కొంది.
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ నేతల సభలకు డబ్బులిచ్చి జనాలను తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడిందని మునుగోడు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్.. ఏం ఘనకార్యం చేశావని దేశ స్థాయిలో కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నావ్ అంటూ ఆయన ప్రశ్నించారు.
మునుగోడు ఉపఎన్నిక కోసం రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలను రచిస్తున్నాయి. ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. విజయమే లక్ష్యం కాషాయ పార్టీ పావులు కదుపుతోంది. మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది.