మునుగోడు కాంగ్రెస్ అడ్డా అని.. అక్కడ హస్తం పార్టీదే గెలుపు అని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ప్రచారానికి వెళ్తానని ఆమె ప్రకటించారు. పెళ్లి కాదు.. పిలిస్తేనే వెళ్లాలి అనడానికి తప్పకుండా వెళ్లి కాంగ్రెస్‌ను గెలిపించుకుంటామన్నారు.
కేసీఆర్, టీఆర్‌ఎస్ గురించి మాట్లాడే అర్హత రాజగోపాల్ రెడ్డికి లేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. 21వేల కోట్ల కాంట్రాక్టు వచ్చాకే కాంగ్రెస్ ను వీడి బీజేపీ పంచన చేరాడని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలకు ఒక్క కాంట్రాక్ట్ ఇవ్వలేదన్న ఆయన.. అభివృద్ధి కోసమే వారు గులాబీ పార్టీలోకి వచ్చారన్నారు.
తనపై ఆరోపణలు చేస్తూ పోస్టర్లు వేశారని.. ఇది పిరికిపందల చర్య అంటూ మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 20 రోజుల నుంచి తానంటే గిట్టని వ్యక్తులు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
TRS will win in Munugodu bypoll says trs mlc kavitha: స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా దోమల్ గూడలోని భారత్ స్కాట్స్ అండ్ గైడ్స్ స్కూల్ లో వనమహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. అనంతరం అందరితో కాలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మునుగోడులో టీఆర్‌ఎస్ కంచుకోట అని, ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో ప్రస్తుతం రాజకీయాలు నడుస్తున్నాయని మండిపడ్డారు. హుజూర్ నగర్, నాగార్జన సాగర్…
Rajagopal Reddy Resigns as MLA: తెలంగాణ కాంగ్రెస్‌లో మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు అందుకు గల కారణాలను వివరిస్తూ.. కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. అయితే ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేయనున్నట్లు.. అందుకోసం స్పీకర్ అపాయిట్‌మెంట్ కోసం చూస్తున్నట్లు ఆయన వెల్లడించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నేడు స్పీకర్‌కు…
బండి సంజయ్ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. దీనిపై ఎన్టీవీకి వివరణ ఇచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అసలు బండి సంజయ్ ఏమన్నారో నాకు తెలియదని అన్నారు. బండి సంజయ్ తో తాను ఎప్పుడూ టచ్ లో లేనని స్పష్టం చేసారు. ప్రధాని మోడీని కలిసిన ఉద్దేశ్యం గురించి కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు. పార్టీ మార్పుపై కోమటిరెడ్డి స్పందించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదించాక జరిగే పరిణామల్ని బట్టి తన నిర్ణయం ఉంటుందని తెలిపారు. తన…
రాజగోపాల్ రెడ్డి 2006 నుంచే నాకు మంచి మిత్రుడని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. పోరాట స్పూర్తి ఉన్న మిత్రుడు రాజగోపాల్ రెడ్డి అని ఈటల పేర్కొన్నారు. రేవంత్ మాటలు సమాజం అసహ్యించుకునే విధంగా ఉన్నాయని తెలిపారు. రేవంత్ గత బ్లాక్ మెయిల్ ఇంకా మరిచినట్లు లేదని విమర్శించారు. రేవంత్ నాలుగు పార్టీలు మారిండని, నిరాశ, నిస్పృహలో రేవంత్ మాట్లాడుతున్నారని ఈటల విమర్శించారు. కాంగ్రెస్ కనుమరుగు అవుతుంది.. ఎందుకు ప్రజాధారణ కోల్పోతుందనే దానిపై శోధించకుండా ఇతర…