బీజేపీతోనే నా ప్రయాణమని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుండే బిజెపి అభ్యర్థిగా బరిలో దిగుతానని బీజేపీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కమలం పార్టీగా మారాయి. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు సవాల్ విసురుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్య లు తీవ్ర దుమారం రేపుతున్నా యి.
కాంగ్రెస్ పార్టీలో పెద్ద రెడ్లు కేసీఆర్ కు అమ్ముడు పోయారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. సీనియర్ల పై నేను చేసిన వ్యాఖ్యలు అంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని అసలు ఆ ప్రస్తావన తేలేదని టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా పార్టీలో పెద్ద రెడ్లు కేసీఆర్ కు అమ్ముడు పోయారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబట్టే కొత్త తరానికి అవకాశం వచ్చిందని అన్నారు.
బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. రాజగోపాల్ అన్న తొందరపడకు, మాట జారకు అంటూ కవిత ట్వీట్ చేశారు. ఈడీ ఛార్జిషీట్‌లో 28 సార్లు తన పేరు చెప్పించినా.. 28 వేల సార్లు చెప్పించినా అబద్ధం నిజం కాదని ట్విటర్ వేదికగా వెల్లడించారు.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై చర్చించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు.
గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి విక్టరీ కొట్టారు.. అయితే, ఈ సారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తేలేదని.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు ఉంటాయని చెబుతూ వస్తున్నారు గులాబీ దళపతి.. ఈ మధ్య జరిగిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలోనే అదే మాట చెప్పారు కేసీఆర్. అయితే, ఆయన మా�