Komatireddy Raj Gopal Reddy: బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్..! అధిష్టాన నిర్ణయం ఫైనల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Raj Gopal Reddy: బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగుతారని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవి కోసం ఎవ్వరూ లాబీయింగ్ చెయ్యడం లేదన్నారు. ఎన్నికల సంవత్సరం కాబట్టి బండి సంజయ్‌ను అధిష్టానం కొనసాగిస్తుందని తెలిపారు. లేదంటే ఆయనకు వేరే భాధ్యతలు ఇస్తారని అన్నారు. అధిష్టాన నిర్ణయం ఫైనల్ అని తెలిపారు. పార్టీ మారుతున్నాని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తెలంగాణ లో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం ఉంది, బీజేపీ పుంజుకుంటుంది. చేరికలు పెద్దఎత్తున ఉంటాయన్నారు. నాపై అపవాదులు, దుష్ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు నమ్మవద్దని కోరుతున్నానని అన్నారు. తెలంగాణ లో పార్టీ బలోపేతం కోసం సునీల్ బన్సాల్ తో నిన్న రాత్రి గంటకు పైగా చర్చించానని అన్నారు.
Read also: YS Viveka Case: గంగిరెడ్డి బెయిల్ వ్యవహారం.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన సీజేఐ
Also Read
- ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
- TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
- Telangana Agriculture : పప్పుధాన్యాల సాగులో తెలంగాణకు రెండో స్థానం.. కేంద్రానికి కీలక ప్రతిపాదనలు
- AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో 'ఏఐ' విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
బీజేపీని బలహీనపరిచే కుట్ర జరుగుతుంది. వారి కుట్రలు సాగవన్నారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత నేను ఎక్కడ ఈ మాటలు అన లేదని క్లారిటీ ఇచ్చారు. కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న నా మిత్రులు నన్ను తిరిగి కాంగ్రెస్‌లోకి రమ్మని అడుగుతున్న మాట వాస్తవమే అని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో గెలవాలని లేదని సంచలన వ్యాఖ్యలు అన్నారు. కేంద్రంలో అధికారంలో లేకుండా, బలమైన నాయకత్వం లేకుండా. తెలంగాణలో కేసీఆర్ ను ఓడించడం సాధ్యం కాదని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన పోవాలనే ఏకైక లక్ష్యంతో తాను బీజేపీలో చేరినట్టుగా చెప్పారు. అయితే..తాను కాంగ్రెస్ చేరతానని చెప్పకపోయినా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై తనకు అభిమానం ఉందని అన్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్, జానా రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క ల ఆధ్వర్యంలో నాలుగు గ్రూపులు తయారయ్యాయని మండిపడ్డారు. ఎన్నికలు జరగలేదు, ఫలితాలు రాలేదు అప్పుడే నాలుగు గ్రూపులు తమ నేత ముఖ్యమంత్రి అంటూ ప్రచారం మొదలుపెట్టాయని ఎద్దేవ చేశారు. నాకు పదవులు అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు.
YS Viveka Case: గంగిరెడ్డి బెయిల్ వ్యవహారం.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన సీజేఐ
తాజావార్తలు
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
-
Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!