Komatireddy Raj Gopal Reddy: బీజేపీతోనే నా ప్రయాణమని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుండే బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతానని బీజేపీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పార్టీ మారుతున్నానంటూ వస్తున్న ప్రచారంపై ఆయన ఖండించారు. కొంతమంది ఇలాంటి పోస్టులతో క్యాడర్ ను అయోమయానికి గురిచేయాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీతోనే తన ప్రయాణం చేస్తాఅని పార్టీ మారే సమస్యలేదని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుండే బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతా అని స్పష్టం చేశారు.
Read also: YS Viveka Case: మరోసారి సీబీఐ ముందుకు ఎంపీ అవినాష్‌రెడ్డి.. విచారణపై ఉత్కంఠ.. ఏం జరుగుతోంది..?
కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కర్ణాటకలో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. క్లియర్ మెజార్టీతో అధికారం హస్తగతం చేసుకుంది. మెుత్తం 224 అసెంబ్లీ స్థానాలుండగా.. 136 సీట్లను కైవసం చేసుకుంది. మెున్నటి వరకు అధికారంలో ఉన్న బీజేపీ 65 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక కింగ్ మేకర్ రోల్ పోషించాలనుకున్న జేడీఎస్ గత ఎన్నికలతో పోలిస్తే.. తక్కువ సీట్లకు పరిమితమైంది. ఈసారి ఆ పార్టీ 19 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. కర్ణాటకలో అనూహ్యమైన విజయం సాధించడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు, క్యాడర్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది. అయితే కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరో ఆరు నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలోనూ కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామంతో టీ కాంగ్రెస్ సభ్యత్వం కూడా పెరగనుంది. ఇతర పార్టీల్లోని అసంతృప్తి నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే బీజేపీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లోకి చేరుతాయనే వార్తలు సంచలనంగా మారాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ లోకి అడుగుపెడతారనే వార్తలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఈనేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ స్పందించారు. బీజేపీ పార్టీని వదిలే సమస్యేలేదని క్లారిటీ ఇచ్చారు. మునుగోడు నుంచే పోటీచేస్తానని స్పష్టం చేయండంతో వ్యవహారం కాస్త సద్దుమణిగింది.
YSR Matsyakara Bharosa Scheme: గుడ్‌న్యూస్.. నేడే వారి ఖాతాల్లో రూ.10 వేలు