తమిళ నటి, బిగ్ బాస్ ఫేం మీరా మిథున్‌ను చెన్నై పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు. కోలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి షెడ్యూల్ కులాలకు చెందిన దర్శకులు, నటులను గెంటేయాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఓ దర్శకుడు తన అనుమతి లేకుండా తన ఫోటోను సినిమా ఫస్ట్ లుక్ కోసం ఉపయోగించాడని ఆరోపిస్తూ షెడ్యూల్డ్ కులాలకు వ్యతిరేకంగా అవమానకరమైన పదాలను ఉపయోగించింది. ‘తక్కువ జాతి అనగా దళిత సామాజిక వర్గానికి చెందిన వారి ఆలోచనలు ఇలానే ఉంటాయి. చాలా చీప్‌గా ప్రవర్తిస్తారు’ అంటూ నోటికొచ్చినట్లు విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై విదుతలై సిరుతైగల్ కట్చి నాయకుడు వన్నీ అరసు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఆమెపై కేసు నమోదు చేశారు. మీరా మిథున్ వీడియో వైరల్ కావడంతో ఆమెను అరెస్ట్ చేయాల్సిందిగా పలువర్గాలు డిమాండ్ చేస్తుండడంతో.. చెన్నై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ సెక్షన్ల కింద అరెస్ట్ చేశారు.
Actress Meera Mithun has used very derogatory term against SC/ST people in her video. This shows her caste conceit mindset. She must be arrested soon. @mkstalin #CrushTheCaste pic.twitter.com/LghONRsKPv
— Mission Ambedkar (@MissionAmbedkar) August 7, 2021