కోలీవుడ్ లో దర్శకుడిగానే కాక హీరోగా కూడా సత్తా చాటుతోన్న సుందరాంగుడు.. సుందర్ సి. ఆయన సినిమాలకు ప్రేక్షకుల్లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. డైరెక్టర్ గా 30 చిత్రాలు పూర్తి చేసినప్పటికీ హీరోగా ఆచితూచి సినిమాలు సైన్ చేస్తుంటాడు. ప్రస్తుతం సుందర్ ‘అరన్మణై 3’ సీక్వెల్ మూవీ పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే, డైరెక్టర్ గానే ఈసారి హీరోగా కూడా కొత్త ప్రాజెక్ట్స్ మొదలు పెట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు టాలెంటెడ్ స్టార్…
సుందర్ హీరోగా 2006లో విడుదలైంది ‘తలై నగరం’ సినిమా. 15 ఏళ్ల తరువాత ఇప్పుడు ఆ చిత్ర దర్శకుడు దురై మళ్లీ సీక్వెల్ ప్రయత్నాల్లో ఉన్నాడు. ‘తలై నగరం 2’లోనూ సుందరే హీరో. అక్టోబర్ నుంచీ షూటింగ్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారట ఫిల్మ్ మేకర్స్. ఇక ‘కట్టపవ కానోమ్’ సినిమా దర్శకుడు మణితో కూడా సుందర్ సి. ఓ సినిమా చేయబోతున్నాడు. దానికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెలువడబోతున్నాయి. చూడాలి మరి, హీరోగా కొంత గ్యాప్ తరువాత వస్తోన్న దర్శకుడు సుందర్ కు టూ అప్ కమింగ్ మూవీస్ ఎలాంటి బాక్సాఫీస్ రిజల్ట్ అందిస్తాయో…