‘సూరరై పోట్రు’తో మరోసారి బౌన్స్ బ్యాక్ అయిన సూర్య మంచి జోష్ లో ఉన్నాడు. కెరీర్ మొదట్నుంచీ ప్రయోగాలకు సై అనే టాలెంటెడ్ హీరో ఈసారి గిరిజన మహిళలపై దృష్టి పెట్టాడట. ‘జై భీమ్’ పేరుతో ఆయన నటిస్తోన్న సినిమాలో 1993 నాటి యదార్థ సంఘటనలు తెరపై కనిపించబోతున్నాయట. చంద్రు అనే లాయర్ చేసిన న్యాయ పోరాటం, దాని వల్ల అమాయక, పేద గిరిజన మహిళలకు కలిగిన లాభం సినిమాలో ప్రధానంగా చూపించబోతున్నారట.
‘సూరరై పోట్రు’ కూడా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించిన బయోపిక్కే. ఇప్పుడు మరోసారి అదే బాటలో పయనిస్తున్నాడు సూర్య. అంతే కాదు, మణిరత్నం ‘నవరస’ వెబ్ సిరీస్ తో సహా పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ఆయన ‘జై భీమ్’ స్వయంగా నిర్మిస్తున్నాడు కూడా. సీన్ రొనాల్డ్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా జ్ఞానవేల్ డైరెక్షన్ లో మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ‘జై భీమ్’లో ప్రకాశ్ రాజ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.
సూర్య మరో రెండు సినిమాల్ని కూడా విడుదలకి సిద్ధం చేస్తున్నాడు. అవి పాండిరాజ్, వెట్రి మారన్ దర్శకత్వంలో రూపొందుతున్నాయి. చూడాలి మరి, ‘సూరరై పోట్రు’ సక్సెస్ ఎఫెక్ట్ అలాగే కంటిన్యూ అవుతుందో లేదో…