కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటిస్తున్న ప్రతి సినిమాను తెలుగులోనూ విడుదల అయ్యేలా చూసుకుంటాడు. ప్రస్తుతం ఆయన కెరీర్ లో 39వ చిత్రంగా వస్తున్న “జై భీమ్” సినిమాను ఓటీటీలోనే విడుదల చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా మేకర్స్ తెలియజేశారు. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ నెలలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సూర్య గిరిజన సంఘాల హక్కుల కోసం, వారి భూమి కోసం పోరాడే న్యాయవాదిగా నటిస్తున్నారు. సూర్య తొలిసారిగా న్యాయవాది పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకి టిజె జ్ఞానవేల్ రచన మరియు దర్శకత్వం వహించారు. రాజీషా విజయన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. సూర్య తన ప్రొడక్షన్ బ్యానర్ 2డి ఎంటర్‌టైన్‌మెంట్ కింద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.