బిగ్‌బాస్ బ్యూటీ, ప్రముఖ తమిళ నటి మీరా మిథున్ కోలీవుడ్ చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తమిళ పరిశ్రమలోని షెడ్యూల్డు కులానికి చెందినా డైరక్టర్లు, యాక్టర్లు, ఇతర నటులు అందరూ బయటకు వెళ్ళిపోవాలని కామెంట్స్ చేసింది. వారి కారణంగా పరిశ్రమలో క్వాలీటి సినిమాలు రావడం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. వారి పద్ధతి, వ్యవహారాలు బాగుండవని మీరా మిథున్ తెలిపింది. కాగా ఆమె చేసిన వ్యాఖ్యలపై షెడ్యూల్డ్ కులాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. చెన్నై, కోయంబత్తూరు, ఈరోడ్, సహా ఏడు జిల్లాలో అమెపై ఫిర్యాదులు నమోదు అయ్యాయి. మీరా మిథున్ మాట్లాడిన వీడియో ఆధారంగా సైబర్ ట్రైం పోలీసులు ఏడు సెక్షన్ లపై కేసు నమోదు చేశారు.