ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మరో అరుదైన కాంబినేషన్ కుదిరింది. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, వైవిధ్యభరిత చిత్రాల హీరో ధనుష్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. అభిరుచితో కొత్త తరహా సినిమాలు చేస్తూ అటు ఆడియెన్స్ ను ఇటు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న శేఖర్ కమ్ముల, ధనుష్ కలయికలో సినిమా వస్తుండటం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.ధనుష్ తో సినిమా రూపొందిస్తున్నట్లు దర్శకుడు శేఖర్ కమ్ముల ట్వీట్ తో అనౌన్స్ చేశారు. తెలుగు,…
పలు తమిళ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన షమన్ మిత్రు (43) గురువారం ఉదయం కరోనాతో చెన్నయ్ లో కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం కోవిడ్ పరీక్ష చేయగా ఆయనకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దాంతో హాస్పటల్ లో చేర్చారు. అయితే ఆయన కరోనా నుండి బయటపడలేకపోయారు. భార్య, ఐదేళ్ళ కుమార్తె ఉన్న షమన్ మిత్రు మంచి నటుడు కూడా. 2019లో వచ్చిన ‘తొరత్తి’ చిత్రంలో షమన్ మిత్రు హీరోగా నటించడమే కాకుండా దానిని నిర్మించారు. గ్రామీణ…
ప్రముఖ దర్శకుడు శంకర్ తల్లి ముత్తు లక్ష్మి (88) మరణించారు. వయోభార సమస్యలతో ఆమె మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి కోలీవుడ్తోపాటు ఇతర చిత్ర పరిశ్రమ ప్రముఖులూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ ద్వారా ఆయన అభిమానులు కూడా సంతాపం తెలుపుతున్నారు. ప్రస్తుతం శంకర్ త్వరలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా, రణవీర్ సింగ్ హీరోగా మరో సినిమా చేయనున్నారు. కమల్ హాసన్ హీరోగా భారతీయుడు 2 తెరకెక్కిస్తున్నారు.
కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. తాజాగా తమిళ నటుడు నితీశ్ వీరా కరోనాకు బలయ్యారు. ధనుష్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అసురన్’లో పాండ్యన్ పాత్రపోషించి గుర్తింపు తెచ్చుకున్న నితీశ్ చెన్నైలోని ఒమందురార్ హాస్పిటల్ లో ఈ రోజు కన్నుమూశారు. ‘పుదుపేట్టై, వెన్నెల కబాడి కుళు, మావీరన్ కిట్టు’ సినిమాల్లో నూ గుర్తింపు ఉన్న పాత్రలను పోషించారు నితీశ్. ఇక రజనీకాంత్ ‘కాలా’లోనూ కనిపించిన నితీశ్ మరణం తమిళ చిత్రపరిశ్రమలో పెద్ద షాక్…
కోలీవుడ్ సీనియర్ సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ కు ఒకరంటే ఒకరి ఎంతో అభిమానం. కమల్ బాల నటుడిగా చిత్రసీమలోకి అడుగుపెడితే, రజనీకాంత్ బస్ కండక్టర్ గా పనిచేస్తూ, యుక్తవయసులో వచ్చాడు. ఇద్దరూ ప్రముఖ దర్శకుడు బాలచందర్ శిష్యులు కావడంతో సహజంగానే వారి మధ్య గాఢానుబంధం ఏర్పడింది. కమల్ యూత్ తో పాటు క్లాస్ ఆడియెన్స్ ను మెప్పిస్తే, రజనీకాంత్ తనదైన బాడీ లాంగ్వేజ్ తో మాస్ గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించున్నాడు. కమల్ నాస్తికుడు,…