యూట్యూబ్ లో ఇద్దరు స్టార్ హీరోయిన్ల ఘాటు రొమాన్స్ .. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం యువత ఆలోచనా విధానం మారుతోంది. తమకిష్టమైన వారితో, తమకిష్టమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నారు. దీనికోసం ఎవరినైనా ఎదిరిస్తున్నారు.. చివరికి సమాజాన్ని కూడా.. ప్రేమకు లింగం అడ్డుకాదు.. గే అయినా, లెస్బెనియన్ అయినా వారి భావాలకు తగ్గట్టు ప్రేమించే హక్కు వారికి ఉంటుంది. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం తప్పుకాదని న్యాయస్థానమే నిర్ణయించింది. అయినా సమాజంలో కొంతమంది వారిని అంగీకరించడంలేదు. అందులో సొంత తల్లిదండ్రులు కూడా పిల్లల భావాలను పట్టించుకోవడం లేదు.. తాజాగా ఇలాంటి ఒక కాన్సెప్ట్ తో కోలీవుడ్ హీరోయిన్లు సరేగమ తమిళ్ ఛానల్‌లో మాగిజిని పేరుతో ఒక మ్యూజిక్ వీడియో చేశారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ ని షేక్ చేస్తోంది.
కోలీవుడ్ లో 96 చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న గౌరీ కిషన్, మరో హీరోయిన్ అనఘా ఇద్దరు లెస్బెనియన్ ప్రేమికులుగా కనిపించారు. చిన్నప్పటినుంచి అమ్మాయిలంటే ఇష్టం ఉండే వీరిద్దరూ భరతనాట్యం స్కూల్ లో కలుస్తారు. ఇద్దరు ప్రేమించుకుంటారు. సహజీవనం చేస్తారు.. వారి విషయం గౌరీ ఇంట్లో తెలిసి ఆమెను బయటకు గెంటేస్తాడు తండ్రి.. హాస్టల్ లో ఒంటరిగా ఉంటున్న అనఘాతో జీవితాన్ని పంచుకోవడానికి గౌరీ సిద్దమవుతుంది. ఇద్దరు కలిసి భరతనాట్యం ప్రోగ్రాం చేస్తారు.. అందులో వారి మనోభావాలను అందరికి అర్థమయ్యేలా చెప్తారు. దాంతో వారి బాధను అర్ధం చేసుకున్న పేరెంట్స్ వారికి ఏది ఇష్టమో అది చేయండి అంటూ పచ్చజెండా ఊపడంతో వీడియో ముగుస్తుంది.
Also Read
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
- Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
- Vijay Deverakonda: సీఎం విజయ్తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
సరేగమ తమిళ్ ఛానల్‌లో ఈ వీడియో విడుదలయింది. లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్స్ పై అవగాహన కల్పించడానికే ఈ మ్యూజిక్ వీడియోను తెరకెక్కించినట్లు మేకర్స్ తెలుపుతున్నారు. ఇక ఈ వీడియోఫై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.. దేవుడా.. తమిళ్ వాళ్ళు అమెరికా 2.0 చూపిస్తున్నారు అని కొందరు.. వాళ్లు ఏదైనా చేయగలరు అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.
తాజావార్తలు
-
West Indies Players-ICC: వెస్టిండీస్కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
ట్రెండింగ్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!