సాయి పల్లవి.. ఫిదా చిత్రంతో వచ్చి తెలుగు కుర్రకారును ఫిదా చేసి శ్యామ్ సింగరాయ్ చిత్రంతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. అయితే సాయి పల్లవి స్టార్‌గా గుర్తింపు పొందేముందు ఎన్నో విమర్శలు, ట్రోల్స్‌ను ఎదుర్కొంది. షూటింగ్ సెట్ లో పొగరు చూపిస్తుందని, ఆటిట్యూడ్ గా ఉంటుందని, హీరోలతో ర్యాష్ గా మాట్లాడుతుందని అనేక విమర్శలు ఎదుర్కొంది. హీరో నానితో, నాగ శౌర్యతో సాయి పల్లవికి గొడవలు ఉన్నట్లు అప్పట్లో రూమర్స్ గుప్పుమన్న సంగతి తెల్సిందే…
సోషల్ మీడియా వచ్చాకా సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. స్టార్ల అకౌంట్లను హ్యాక్ చేయడం, వారి పేరు మీద ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేయడం అలవాటుగా మారిపోయింది. ఇప్పటికే చాలామంది నటీనటులు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇక తాజగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ భార్య షాలిని కూడా ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటుంది. నటిగా, అజిత్ భార్యగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న షాలిని పేరుమీద ట్విట్టర్ లో ఒక కొత్త అకౌంట్ ఓపెన్ అయ్యింది. మిస్సెస్…
సమంత నటించిన సినిమా ఏప్రిల్ లో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. విజయ్ సేతుపతితో, నయనతారతో కలసి సమంత నటించిన తమిళ సినిమా ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమా విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. దర్శకుడు విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో టీజర్‌ను ఫిబ్రవరి 11న విడుదల చేయనున్నట్లు పోస్టర్ ద్వారా తెలియచేశాడు. ఇక ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదల కానుంది. టీజర్ తో పాటు మూవీ విడుదల తేదీ ప్రకటిస్తూ ‘2.2.2022న 2.22కి రిపోర్టింగ్.…
ఇప్పుడప్పుడే ఈ కరోనా మహమ్మారి పోయేలా కనిపించడం లేదు. చిత్ర పరిశ్రమను ఒక్కసారిగా కుదేలు చేసిన ఈ మహమ్మారి మరోసారి ప్రజలపై విరుచుకుపడుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా స్టార్స్ కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తుంది. ఈ మధ్యనే కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. రాధికా శరత్ కుమార్, వరలక్ష్మి శరత్ కుమార్ కు పాజిటివ్ రావడంతో వారు ఐసోలేషన్ లో ఉండి ఇటీవలే బయటికి…
కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ హీరోయిన్ మంజులను వివాహమాడి అటు తమిళ్ లోనూ, ఇటు తెలుగులోనూ సుపరిచితుడిగా మారారు. ఇక ఆయన ముగ్గురు కూతుళ్లు కూడా హీరోయిన్లుగా నటించనినవారే. ముఖ్యం వనితా విజయ్ కుమార్ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. ఆమె వివాదాలు, ఆమె పెళ్లిళ్లు వలన అందరికి ఆమె పరిచయమే. ఇటీవల బిగ్ బాస్ కి వెళ్లి ప్రేక్షకుల మన్ననలు పొందిన వనితా తాజగా…
మాస్ మహరాజా రవితేజ ‘ఖిలాడి’ సినిమా ఫిబ్రవరి 11న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. అదే తేదీన విష్ణు విశాల్ ‘ఎఫ్.ఐ.ఆర్.’ మూవీ సైతం రిలీజ్ అవుతోంది. చిత్రం ఏమంటే… ‘ఎఫ్.ఐ.ఆర్.’ మూవీకి రవితేజ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. విష్ణు విశాల్ తమిళంలో ‘భీమిలి కబడ్డి జట్టు, రాక్షసుడు’ చిత్రాలలో నటించాడు. అవి రెండూ తెలుగులో రీమేక్ అయ్యి చక్కని విజయం సాధించాయి. అలానే ఇటీవల వచ్చిన రానా ‘అరణ్య’లోనూ విష్ణు విశాల్ కీలక పాత్ర పోషించాడు. అతని…
చియాన్ విక్రమ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రాబోతుంది. అస్సలు విడుదల అవుతుందా..? లేదా అని అభిమానుల్లో ఆందోళన తీసుకొచ్చిన సినిమా ఎట్టకేలకు విడుదల తేదిని ఖరారు చేసుకోంది. స్టార్ హీరో విక్రమ్, ఆయన కొడుకు ధృవ్ విక్రమ్ మల్టీస్టారర్ గా యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మహాన్’. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఒకానొక సమయంలో ఈ సినిమా రిలీజ్ అవుతుందా..? అనే అనుమానం…
కోలీవుడ్ బ్యూటీ శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇప్పుడిప్పుడే అమ్మడు కొత్త జీవితం ప్రారంభిస్తుంది. కొన్నేళ్ల క్రిత్రం శృతిహాసన్ మేఖేల్ కోర్సల్ తో డేటింగ్ చేసి విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ బ్రేకప్ తరువాత శృతి కొంత గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత క్రాక్ తో హిట్ అందుకొని బౌన్స్ బ్యాక్ అయిన ఈ బ్యూటీ ఇటీవలే శంతను హజారికతో సహజీవనం చేయడం మొదలుపెట్టింది. లాక్ డౌన్ సమయంలో ముంబైలో వీరిద్దరు…