తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత అస్సలు వారసురాలు ఎవరు అంది ఇప్పటికి మిస్టరీగానే మారింది. ఇప్పటివరకు ఆమె వారసురాలిని నేను అంటే నేను అని చాలామంది మీడియా ముందు రచ్చ చేశారు. ఇక తాజాగా మరో మహిళ తాను జయలలిత, శోభన్ బాబు ల వారసురాలిని అంటూ తహసీల్దార్ కార్యాలయంలో రచ్చ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మధురై తిరుమళ్లువర్ నగర్ కు చెందిన 38ఏళ్ల మీనాక్షి కి మురుగేశన్ అనే వ్యక్తితో వివాహమైంది.…
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా అంటే అవుననే అంటున్నాయి కోలివుడ్ వర్గాలు. ఇప్పటివరకు విజయ్ రాజకీయాల గురించి ఎప్పుడు మాట్లాడిన..అలాంటి ఉద్దేశ్యం లేదని, ప్రస్తుతం సినిమాలపైనే తన దృష్టి అంతా అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ ‘ఆలిండియా దళపతి విజయ్ మక్కల్ ఇయక్కం’ పేరుతో ఒక పార్టీ పేరును రిజిస్టర్ చేయించినా .. దాని బలవంతంగా ఉపసంహరించుకునేలా చేశాడు విజయ్.. దీంతో విజయ్ కి రాజకీయాలపై ఆసక్తిలేదని…
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ని స్టార్ హీరోగా మార్చిన సినిమా బిచ్చగాడు. తమిళ్ తో పాటు తెలుగులోనూ డబ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా భారీ విజయాన్ని అందుకొని విజయ్ కి మంచి పేరు తీసుకొచ్చిపెట్టింది. ఇక ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న చిత్రం బిచ్చగాడు 2. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీనే దర్శకత్వం, సంగీత దర్శకత్వం వహిస్తుండడం విశేషం.…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం బీస్ట్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. ఇక ఇటీవలే ఈ చిత్రం నుంచి రిలీజైన అరబిక్ కుత్తు సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇక…
కోలీవుడ్ లవ్ బర్డ్స్ నయన్ తార- విఘ్నేష్ శివన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు రోజూ వింటూనే ఉన్నాం. కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్న ఈ జంట ఈ మధ్యనే ఎంగేజ్ మెంట్ చేసుకున్నారన్న విషయం తెల్సిందే. అదికూడా నయన్ ఒక షో లో రివీల్ చేయడంతో కన్ఫర్మ్ అయ్యింది. దీంతో ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు నయన్- విఘ్నేష్ ల వివాహం అయిపోయినట్లు తెలిసి షాక్ అవుతున్నారు.…
కోలీవుడ్ హీరో విశాల్ కి మద్రాసు హైకోర్టు లో చుక్కెదురయ్యింది. లైకా ప్రొడక్షన్ సంస్థ కేసు విషయంలో విశాల్కు కోర్టు షాకిచ్చింది. అంతేకాకుండా మూడు వారాల్లో రూ.15 కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వద్ద హీరో విశాల్ ‘వీరమే వాగౌ సుడుం’ కోసం రూ.15 కోట్ల రుణాన్ని తీసుకున్నారు. సినిమా పూర్తిచేసి, విడుదల చేసినా ఇంకా ఆ రుణాన్ని విశాల్.. సదురు సంస్థకు తిరిగి…
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ చెన్నై నుంచి హైదరాబాద్ కి మకాం మార్చిన విషయం తెలిసిందే. ఇక్కడే ఒక ఇల్లు తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇకనుంచి ఇక్కడే ఉండనున్నదట. క్రాక్ చిత్రంతో తెలుగులో మంచి పేరు తెచ్చుకునన్ వరలక్ష్మీ ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంది. ఇక ఒక పక్క కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంటే టాలీవుడ్ లో తన ప్రత్యేకతను చాటుతుంది. అయితే సడెన్ గా అమ్మడు చెన్నై…