Vijay Antony: ఈ ‘బిచ్చగాడు’ చరిత్ర తిరగరాస్తాడట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ ని స్టార్ హీరోగా మార్చిన సినిమా బిచ్చగాడు. తమిళ్ తో పాటు తెలుగులోనూ డబ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా భారీ విజయాన్ని అందుకొని విజయ్ కి మంచి పేరు తీసుకొచ్చిపెట్టింది. ఇక ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న చిత్రం బిచ్చగాడు 2. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీనే దర్శకత్వం, సంగీత దర్శకత్వం వహిస్తుండడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల ఈ సినిమా థీమ్ సాంగ్ యాంటీ బికిలీ ఎవరు..? అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తికరంగా మారింది.
ఇక తాజాగా యాంటీ బికిలీ ఎవరు అనేది థీమ్ సాంగ్ తో చెప్పేశారు మేకర్స్. బిచ్చగాడు లో తల్లి కోసం కోట్ల రూపాయలను వదిలి బిచ్చగాడిలా మారిన హీరో.. ఇప్పుడు ఆ బిచ్చగాళ్ల కోసం యాంటీ బికిలీ అనే పేరుతో ఒక మిషన్ ని మొదలుపెడతాడు. అందులో భాగంగానే ఒక ధనవంతుడు .. బిచ్చగాడిగా మారి.. వారి సమస్యలు తెలుసుకోవడానికి బయల్దేరతాడు. ఇతడే యాంటీ బికిలీ అని తెలుస్తోంది. ఇక ఇతగాడి లక్ష్యమేంటీ అనేది కూడా థీమ్ సాంగ్ లో తెలిపారు. చరిత్రను సంపన్నులు రాశారు. పేదల బతుకులు వాళ్లకు తెలియదు. వస్తున్నాడు చరిత్రను మార్చి రాసేందుకు యాంటీ బికిలీ అంటూ చెప్పుకొచ్చారు. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ధర్మ సంస్థాపనార్దయా సంభవామి యుగే యుగే శ్లోకం వినిపించడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన కావ్యా థాపర్ నటిస్తోంది. మరి ఈసారి ఈ బిచ్చగాడు ఎలాంటి చరిత్రను సృష్టిస్తాడో చూడాలి.
Also Read
- Nick Jonas: హాలీవుడ్ రేంజ్‌కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్‌తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
- Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్‌తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్‌కు మాస్టర్ స్ట్రాటజీ!
- SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా..
- Dil Raju: న్యాచురల్ స్టార్ నానికి రూ.110 కోట్ల ఆఫర్ ఇచ్చిన దిల్ రాజు.. ఇది నిజమేనా?
తాజావార్తలు
-
New Smartphones: స్మూత్ డిస్‌ప్లే.. 8000mAh బ్యాటరీ.. రేపు లాంచ్ కాబోతున్న ఫోన్లు ఇవే..
-
Nick Jonas: హాలీవుడ్ రేంజ్‌కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్‌తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
-
Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
-
Uttar Pradesh: అజాంఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్‌పై యోగి బుల్డోజర్ యాక్షన్..
-
Trump: ట్రంప్ చిత్రంతో బంగారు నాణెం విడుదల.. ప్రత్యేకత ఇదే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్‌ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!