కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో.. ఫ్యామిలీకి కూడా అంటే ఇంపార్టెన్స్ ఇస్తాడు. స్టార్ హీరోయిన్ షాలినిని ప్రేమించి పెళ్లి చేసుకున్న అజిత్ తన కుటుంబాన్ని మీడియాకు దూరంగా ఉంచుతూ ఉంటాడు. అజిత్- షాలినికి ఇద్దరు పిల్లలు. వారుకూడా ఏదైనా ఫంక్షన్స్ లో కనిపించడం తప్ప సినిమా ఫంక్షన్స్ లో అస్సలు కనిపించరు. అయితే ఇక ఇటీవల జరిగిన ఫ్యామిలీ ఫంక్షన్ లో అజిత్ ఫ్యామిలీ సందడి చేసిన విషయం తెల్సిందే. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
ఇక ఈ ఫంక్షన్ నుంచి మరో ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అజిత్ – షాలిని జంటగా పార్టీలో డాన్స్ చేస్తూ కనిపించారు. బ్లూ లైట్ లో షాలినిని వెనుకనుంచి హాగ్ చేసుకొని అజిత్ ఆమె బుగ్గపై కిస్ పెడుతూ కనిపించాడు. వారి 23 ఏళ్ల వివాహ బంధంలో పబ్లిక్ గా ఇలా ఈ జంట కనిపించడం మొదటిసారి కావడం విశేషం. దీంతో అజిత్ అభిమానులు ఈ ఫోటోను వైరల్ గా మార్చేశారు. అద్భుతం అనే సినిమాతో అజిత్- షాలిని మధ్య ప్రేమ చిగురించింది. ఆ తరువాత ఇరు కుటుంబాలను ఒప్పించి ఈ జంట 2000 సంవత్సరంలో వివాహమాడారు. పెళ్లి తరువాత షాలిని సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం గృహిణిగానే ఉంటున్న షాలిని ముందు ముందు రీ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.