Amarnath Reddy: ఏపీ పోలీసుల తీరుపై టీడీపీ నేత, మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయడం దారుణమన్నారు. చంద్రబాబు పర్యటనలో తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నందుకు 59 మందిపై కేసులు నమోదు చేశారని.. అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలను ప్రభుత్వం అరెస్ట్ చేయించడం భావ్యం కాదన్నారు. అన్నం పెట్టే అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేసిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అక్రమంగా టీడీపీ…
చాలా కాలం తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ నేతలతో కలిసి టీడీడీ ఎంపీ కేశినేని నాని ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అగ్ని కుల క్షత్రియుల భవన నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నుంచి ఎంపీ కేశినేని నాని రూ. 65 లక్షలు కేటాయించారు. విజయవాడ ఆటో నగర్‌లో తమకున్న స్థలంలో అగ్నికుల క్షత్రియులు భవన నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు ఎంపీ ల్యాడ్స్ నిధులను కేటాయించినందుకు ఎంపీ కేశినేని నానికి అగ్నికుల క్షత్రియులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ…
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం జగన్ పాలనలో నిత్యం హత్యలు, దాడులు, మహిళలపై మానభంగాలతో రాష్ట్రం వల్లకాడులా మారిందని విమర్శించారు. మాచర్లలో జల్లయ్య హత్య ముమ్మూటికి వైసీపీ ప్రభుత్వ హత్యే అని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా పోస్టుమార్టం చేసి తీసుకెళ్లారని.. బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా టీడీపీ నేతల్ని, బీసీ సంఘాల నేతల్ని హౌస్ అరెస్టులు చేయటం దుర్మార్గం…
వైసీపీ మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలపై మండిపడ్డారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా గన్నవరంలో ఎన్టీఆర్ విగ్రహానికి అడ్డంగా ఫ్లెక్సీలు కట్టి మొహాన్ని కనబడకుండా చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి అడ్డంగా డయాస్ కట్టిన వంశీ చరిత్ర హీనుడుగా మిగిలిపోతాడు.సామాజిక న్యాయానికి సమాధులు కట్టి బస్సు యాత్ర చేస్తున్నారని విమర్శించారు. వై.వి.సుబ్బారెడ్డికి మోకాళ్ళ మీద దణ్ణాలు పెట్టిన వాళ్లు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారా..?ఒక్క పైసా కూడా కార్పొరేషన్ ద్వారా ఏ…
వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద అర్హులైన మత్స్యకారులకు రూ.10 వేల చొప్పున డబ్బులను విడుదల చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. అయితే, ఈ పథకంపై ఆరోపణలు గుప్పించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.. 217 జీవోతో మత్య్సకార జీవనోపాధిని జగన్ నిలువునా ముంచారన్న ఆయన.. మత్య్సకార వృత్తిలో 15 లక్షల మంది ఉండగా.. మత్య్సకార భరోసా కేవలం లక్షా 8 వేల మందికి మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. Read Also:…
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది… ఈ వ్యవహారంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విమర్శలు ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి… తాజాగా, ఆ విషయంపై స్పందించిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.. సీఎం వైఎస్ జగన్ సొంత బాబాయి (వైఎస్ వివేకానందరెడ్డి)ని ఎవరు చంపారో క్లారిటీ వచ్చిందన్నారు.. సీబీఐ విచారణలో అవినాష్ రెడ్డి ప్రథమ ముద్దాయిగా.. జగన్ కూడా అందులో భాగస్వామిగా తేలిందని వ్యాఖ్యానించిన ఆయన.. వైఎస్ వివేకా…
మంత్రి కొడాలి నానిపై టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ నారాయణ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడివాడలో మీడియాతో మాట్లాడిన వారు మంత్రి కొడాలి నానిపై విరుచుకుపడ్డారు. కొడాలినాని నిర్వహిస్తున్న జూద క్రీడలు బయటపడతాయన్న భయంతోనే టీడీపీ నిజనిర్ధారణ కమిటీని అడ్డుకునేందుకు వైసీపీ నాయకులు ప్రత్నిస్తున్నారని నారాయణరావు అన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఎటువంటి సమావేశాలు నిర్వహించని మంత్రి నాని, నేడు కే కన్వెన్షన్ లో ఎస్సీ సెల్…