ఏఐ (AI) కెమెరాలతో భారత సరిహద్దులో నిఘా..చొరబాటుదారుల కట్టడికి యత్నం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో కూడిన కెమెరాలతో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులను పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రత్యేక కెమెరాలను సరిహద్దు భద్రతా దళం (BSF) భద్రతను పెంచడానికి, చొరబాటుదారులను నిరోధించడానికి వినియోగిస్తోంది. కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్ పరికరాలతోపాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సరిహద్దుల్లో నిఘా పెంచామని బీఎస్ఎఫ్ అధికారులు చెబుతున్నారు. ఇది చొరబాట్లు, నేరాలు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధిస్తుంది. సరిహద్దు పోస్టుల వద్ద బలగాల సంఖ్యను పెంచామని,…
దొంగపట్టా ఇచ్చిన దొంగ, మోసగాడు…..దగాకోరు..కొల్లు రవీంద్ర అని ధ్వజమెత్తారు పేర్ని నాని. పేర్ని నాని బతికి ఉన్నంత కాలం పేదొడు దర్జాగా, ధైర్యంగా బ్రతుకుతారు…అలానే బ్రతికిస్తానని పేర్నినాని వ్యాఖ్‌యానించారు. మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడచిన రెండు రోజులుగా కొల్లు రవీంద్ర ఓటమి భయంతో అధికారులను బెదిరిస్తూ అవాకులు చవాకులు పెలుతున్నరు అని ఘాటుగా వ్యాఖ్యానించారు పేర్ని నాని. బలరాంపేట వడ్డెర బస్తీలో పార్కు స్థలం…
మచిలీపట్నంలో అర్థరాత్రి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దొంగ పట్టాలు సిద్దం చేస్తున్నారని రెవెన్యూ సిబ్బందిని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పట్టుకున్నారు. అయితే.. అవి దొంగ పట్టాలు కాదని పెండింగ్ లో ఉన్న పట్టాలకు సంబంధించి వర్క్ చేస్తున్నామని రెవెన్యూ సిబ్బంది వెల్లడించారు. దీంతో.. కొల్లు రవీంద్ర సహా పలువురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మార్వో సతీష్. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. మరో 24 గంటల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల…
వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. జగన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాలకు క్రీడాకారులకు కూడా బలైపోతున్నారని దుయ్యబట్టారు. అందుకు నిదర్శనం హనుమ విహారినేనని అన్నారు. ప్రతిభ, సామర్థ్యాలున్న హనుమ విహారిని కాదని, వైసీపీ నాయకుడి కోసం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పని చేయడం క్రీడాలోకానికే అవమానం అని పేర్కొన్నారు. శరత్ చంద్రారెడ్డి నేతృత్వంలో ఏపీ క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రతిష్ట మసక బారిందని వ్యాఖ్యానించారు. దోపిడీకి ఆలవాలంగా మారిందని పేర్కొన్నారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై పేర్ని నాని ఫైర్ అయ్యారు. కొల్లు రవీంద్ర ఓటమి భయంతో సిగ్గు ఎగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారని పేర్ని నాని తీవ్రంగా విమర్శించారు. పాపపు సొమ్ముతో చండి యాగాలు, పూజలు చేయడం కాదని.. 3 స్తంభాల సెంటర్ నుంచి బైపాస్ రోడ్లో పేదలకు స్థలాలు ఇచ్చింది నా తండ్రి పేర్ని కృష్ణమూర్తి అని ఆయన పేర్కొన్నారు.
ఆడుదాం ఆంధ్ర వల్ల ప్రజలకు ప్రయోజనం ఏమిటి అంటూ మాజీ మంత్రి ప్రశ్నించారు. జగన్ దోచుకోవడానికి ఇదొక కొత్త డ్రామా.. స్టేడియాల అభివృద్ధి లేదు.. క్రీడాకారులు ప్రోత్సాహం లేదు.. మంత్రి సీదిరి అప్పల రాజు నోరు అదుపులో పెట్టుకో.. చర్చకు రాకుండా పారిపోయిన నువ్వు.. ఇంకో సారి వాగితే రోడ్ల మీద తిరగనివ్వం అంటూ కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నానికి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రితో బేరాలు చేసుకోవడం, సెటిల్మెంట్ చేసుకోవడం, బ్లాక్ మెయిల్ చేయటం పేర్ని నానికి అలవాటు అని ఆయన ఆరోపించారు.