వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నానికి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రితో బేరాలు చేసుకోవడం, సెటిల్మెంట్ చేసుకోవడం, బ్లాక్ మెయిల్ చేయటం పేర్ని నానికి అలవాటు అని ఆయన ఆరోపించారు.
కొల్లు రవీంద్రకు దేవుడు ఒక శాపం ఇచ్చాడని అది సిగ్గు లేకుండా మాట్లాడటమని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. బందరు అభివృద్ధిలో నువ్వు చేసింది ఏమిటో నేను చేసింది ఏమిటో శ్వేత పత్రం విడుదల చేద్దామా అంటూ నాని కొల్లు రవీంద్రకు సవాల్ విసిరారు.
మాజీ మంత్రి పేర్ని నానిపై కొల్లు రవీంద్ర తీవ్రంగా మండిపడ్డారు. దొంగే దొంగ అన్నట్టు పేర్ని నాని తీరు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. దొంగ ఓట్లపై హైకోర్టులో కేసు నడుస్తోందన్నారు. ఆ పిల్ ప్రకారం ఆర్డీఓ, డీటీకి షోకాజ్ నోటీసులు ఇస్తే కాళ్లు పట్టుకుని అపుకున్నాడని ఆయన విమర్శించారు.
Kollu Ravindra: టీడీపీ బీసీ సాధికార కమిటీ ఛైర్మన్, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ సోదరులను కనీసం కూర్చోబెట్టి మాట్లాడకుండా సీఎం జగన్ అవమానించారని ఆరోపించారు. వైసీపీకి బీసీలంటే ఓటు బ్యాంక్ మాత్రమే కానీ బ్యాక్ బోన్ కాదన్నారు. బీసీలకు పెద్ద పీట వేస్తామని విజయవాడ సాక్షిగా జగన్ బహిరంగంగా ప్రకటించారని.. పెద్ద పీట వేయడమంటే నిల్చోబెట్టి అవమానించడమేనా అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి కుర్చీలో కూర్చొని..…