ఏపీలోని గుంటూరులో బీసీ సంఘాల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గుంటూరులో టీడీపీ ఆధ్వర్యంలో బీసీ సంఘాల నిరసన …బీసీ నాయకుడు మండల్ విగ్రహ దిమ్మెను కార్పొరేషన్ అధికారులు తొలగించడంపై బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాలో పాల్గొన్నారు టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. బీసీల కోసం పోరాడిన యోధుడు మండల్… వైసీపీ ప్రభుత్వం మండల్ విగ్రహా ఏర్పాటుకు పర్మిషన్ ఇవ్వడం లేదు …రోజుకో ప్రాంతంలో వైఎస్ఆర్ విగ్రహాలు పెడుతున్నారు… వాటికి పర్మిషన్లు ఎవరిస్తున్నారు…! అని ఆయన ప్రశ్నించారు.
Read Also: Rohit Sharma: రో‘హిట్’.. ధోనీ రికార్డ్ బ్రేక్
బడుగు బలహీన వర్గాలకు చెందిన మండల్ విగ్రహానికి పర్మిషన్ లేదని కూలగొట్టేశారు..బీసీలకు సమన్యాయం అనే పేరుతో బీసీ మంత్రులు బస్సు యాత్రలు చేశారు …ఆ మంత్రులు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు? బీసీల మనోభావాలను దెబ్బతీసే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది….మండల్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వకపోతే బీసీల సత్తా ఏంటో చూస్తారు..
Read Also: Operation Garuda: ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో అన్ని రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు