వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద అర్హులైన మత్స్యకారులకు రూ.10 వేల చొప్పున డబ్బులను విడుదల చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. అయితే, ఈ పథకంపై ఆరోపణలు గుప్పించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.. 217 జీవోతో మత్య్సకార జీవనోపాధిని జగన్ నిలువునా ముంచారన్న ఆయన.. మత్య్సకార వృత్తిలో 15 లక్షల మంది ఉండగా.. మత్య్సకార భరోసా కేవలం లక్షా 8 వేల మందికి మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు.
Read Also: WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక క్షణాల్లో..!
ఇక, మత్య్సకార భరోసా రూ.10వేలు ఇచ్చి, పెంచిన ఛార్జీలు, నిత్యావసర ధరలతో రూ.30 వేలు ఒక్కో కుటుంబం నుంచి గుంజుకుంటున్నారని ఆరోపించారు కొల్లు రవీంద్ర.. తెలుగుదేశం ప్రభుత్వం కల్పించిన అనేక పథకాలు రద్దు చేశారని ఫైర్ అయ్యారు. కేంద్ర సంస్థ ఓఎన్జీసీ ఇచ్చిన రూ.108 కోట్లు తాను ఇచ్చినట్లు కలరింగ్ ఇచ్చి మోసపు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.. ప్రభుత్వ నిధులు ఖర్చు చేసి టీడీపీ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనం అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.