ప్రధాని మోడీ బుధవారం కోల్‌కతాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భారతదేశంలోనే మొట్టమొదటి నీటి అడుగున ప్రయాణించే మెట్రో రైలు సర్వీస్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు.
Live-in relationship: సహజీవనం విషాదంగా మారుతోంది. లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న వారు హత్యలకు గురవుతున్నారు. దేశ రాజధానిలో శ్రద్ధా వాకర్ హత్య ఈ కోవకే చెందుతుంది. ఆమె పార్ట్‌నర్ అఫ్తాబ్ పూనావాల అత్యంత కిరాతంగా శ్రద్ధాను హత్య చేయడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ తర్వాత నుంచి పలు సందర్భాల్లో లివ్ రిలేషన్‌లో ఉన్న మహిళలు హత్యలకు గురయ్యారు.
రాష్ట్ర బకాయిలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసినందుకు నిరసనగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరసన చేపట్టనున్నారు. ముఖ్యంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MNREGA) కింద కేంద్రం బకాయిలను నిలుపుదల చేసింది. దీంతో కేంద్ర సర్కార్ కు వ్యతిరేకంగా ఇవాళ మమతా బెనర్జీ ఆందోళనకు పిలుపునిచ్చింది.
Mamata Banerjee: అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడు ఈ రోజు కొలువయ్యాడు. 500 ఏళ్ల కల ఈ రోజు రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టతో నిజమైంది. దేశం మొత్తం అంతా శ్రీరామ నామంతో నిండిపోయింది. అన్ని ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా, దేశంలోని ప్రముఖుల, లక్షలాది మంది భక్తుల సమక్షంలో భవ్య రామ మందిర ప్రారంభోత్సవం జరిగింది.
మున్సిపల్ ఉద్యోగాల కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందం ఇవాళ పశ్చిమ బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు చేస్తుంది. మంత్రి సుజిత్ బోస్‌కు సంబంధించిన ఇళ్లతో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తపస్ రాయ్, మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్‌కు సంబంధించిన ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
ప్రముఖ సంగీత విద్వాంసుడు ఉస్తాద్ రషీద్ ఖాన్(55) క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్ కారణంగా చాలా కాలంగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నివేదిక ప్రకారం, డిసెంబరులో సెరిబ్రల్ అటాక్‌కు గురైన తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలోనే మొదట టాటా మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందారు.
Bhagavad Gita: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిర్వహించిన ‘భగవద్గీత పఠనం’ బీజేపీ, టీఎంసీల మధ్య రాజకీయ దుమారాన్ని రేపుతోంది. బీజేపీ హిందూ ఐక్యతను ప్రోత్సహిస్తోందని, హిందూ ఓట్ల కోసమే ఇలా చేస్తున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కోల్‌కతాలో బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో భగద్గీత పఠనానికి లక్ష మంది ప్రజలు హాజరయ్యారు. భగవద్గీతలోని శ్లోకాలను పఠించారు. ఈ కార్యక్రమంలో బెంగాల్ బీజేపీ యూనిట్,
India-Pak: ఇటీవల కాలంలో పాకిస్తాన్ యువతులు, ఇండియన్ అబ్బాయిలకు పడిపోతున్నారు. తాజాగా ఓ పాకిస్తాన్ యువతి ఇండియన్ అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు వచ్చింది. కోల్‌కతాకు చెందిన వ్యక్తి సమీర్ ఖాన్ని పెళ్లి చేసుకునేందుకు కరాచీకి చెందిన యువతి జవేరియా ఖానుమ్ భారత్ వచ్చింది.మంగళవారం వాఘా-అట్టారీ అంతర్జాతీయ సరిహద్దు నుండి భారతదేశానికి చేరుకుంది.. వచ్చే ఏడాది జనవరిలో వీరిద్దరి వివాహం నిశ్చయమైంది. కాబోయే కోడలికి భర్త సమీర్ ఖాన్, అతని కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు.
Safest City: వరసగా మూడో ఏడాది కూడా ఇండియాలో అత్యంత సురక్షిత నగరంగా కోల్‌కతా రికార్డు సృష్టించింది. బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఇతర నగరాలో పోలిస్తే నేరాలు తక్కువగా నమోదవుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) తన నివేదికలో తెలిపింది. మహానగరాల్లో ప్రతీ లక్ష మంది జనాభాకు అతి తక్కువ నేరాలు నమోదు చేసిందని వెల్లడించింది. 2022లో ఈ నగరంలో ప్రతీ లక్ష మందికి 86.5 కాగ్నిజబుల్ నేరాల కేసులు నమోదయ్యాయి.
Earthquake: బంగ్లాదేశ్‌లో శనివారం ఉదయం 5.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. చిట్టగాంగ్‌లోని భూమి అంతర్భాగంలో 55 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.