నా వెంట్రుక ముక్క కూడా చంద్రబాబు పీకలేరు అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు ఉడత ఊపులకు భయపడను.. చంద్రబాబు ఎంతటి మోసగాడో అందరికీ చెబుతూనే ఉంటాను.. గెలుపు కోసం పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకుంటున్నారు.. బూట్లు నాకుతున్నారు.. శత్రువుకు కూడా లోకేష్ లాంటి కొడుకు పుట్టకూడదు.
గుడివాడలో రా..! కదలి రా..! కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. మాజీ మంత్రి కొడాలి నానిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ కొడాలి నానిది నోరా..? డ్రైనేజా..?.. నా దగ్గరే ఓనమాలు నేర్చుకుని.. నన్నే విమర్శిస్తారా..? నేనేంటో చూపిస్తానంటూ ఆయన పేర్కొన్నారు.
వెయ్యి మంది బాలయ్యలు, వెయ్యి మంది చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని..
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా.. గుడివాడలో పొలిటికల్ రగడ మొదలైంది.. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా టీడీపీ, వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక.. సీఎం జగన్ ట్విట్టర్ లో విషెస్ తెలిపారని అన్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తుంటి విరిగింది కాబట్టి.. జగన్ పరామర్శించారని, రేవంత్ కు తుంటి విరగలేదు కదా అని కామెంట్ చేశారు.
రాజకీయ మనుగడ కోసమే షర్మిల కాంగ్రెస్లో చేరారని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ రిజెక్టెడ్ పార్టీ, ఏపీకి ద్రోహం చేసిన పార్టీ అంటూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి కోలుకునే పరిస్థితి ఏపీలో లేదన్నారు.