ఎన్నికల వేళ.. ఏపీలో రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠగా మారుతున్నాయి. వైసీపీలో అసంతృప్తులంతా ఎవరి దారి వారు చూసుకుంటుంటే.. టికెట్ల ప్రకటన తర్వాత టీడీపీ, జనసేనలో మొదలైన లుకలుకలను ఆయుధంగా మార్చుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది. ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వంగవీటి రాధాను మళ్లీ పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది వైసీపీ.
మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిపై విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన కృష్ణా జిల్లా గుడివాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఎక్కడ యుద్దం చేస్తారో వారికే తెలియదని సెటైర్లు వేశారు. అసలు కలిసి యుద్ధం చేస్తారో లేదో కూడా పవన్ కళ్యాణ్ , చంద్రబాబు నాయుడు కి తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి 175 స్థానాలలో పోటీకి సిద్దమని, జనసేన ఎన్ని చోట్ల యుద్దానికి…
TDP నేత మన్నెం వెంకటరమణ కన్నుమూత టీడీపీ నేత, ఎన్నారై మన్నెం వెంకటరమణ (53) కన్నుమూశారు. అమెరికాలోని న్యూజెర్సీ నుంచి విమానంలో హైదరాబాద్ వస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను ఏథెన్స్ విమానాశ్రయంలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతిచెందారు. కాగా వెంకటరమణ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన అమెరికాలోని పలు జాతీయ స్థాయి తెలుగు సంఘాల్లో కీలకపాత్ర పోషించారు. అయితే.. అమెరికాలోని న్యూ…
రోడ్లపై మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే తొలి ఆరు నెలల్లోనే రోడ్లన్నీ వేస్తామని హామీ ఇచ్చారు. రోడ్లపై సీఎం జగన్ మేనిఫెస్టోలో కీలక ప్రకటన చేయబోతున్నారని చెప్పారు. చంద్రబాబు హయాంలోని పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడానికే తమకు 2 ఏళ్లు పట్టిందని అన్నారు. ఆ తర్వాత కరోనా వచ్చి, పనులు ఆగిపోయాయని నాని వివరించారు. అంతేకాకుండా.. మేమూ సిద్ధం అంటూ ఫ్లెక్సీలతో హడావిడి చేస్తున్న జనసేన అధినేత…
ఏపీలోని ప్రతిపక్షాలపై మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. చెల్లెమ్మ, వదినమ్మలతో చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలకు తెర లేపాడని ఆయన తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు, బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మ, ఉత్త పుత్రుడు, దత్తపుత్రుడిని కట్టగట్టి బంగాళాఖాతంలో పడేయాలని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
వైసీపీలో ఏడవ జాబితాపై కసరత్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో.. సీఎంవో నుంచి పిలుపు అందుకున్న నేతలు తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు ఎమ్మెల్యేలు, నేతలు క్యూ కడుతున్నారు. ఈరోజు సీఎంవో కార్యాలయానికి కొడాలి నాని, వల్లభనేని వంశీ, కర్నూలు నియోజకవర్గానికి చెందిన ఎస్వీ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు.
నా వెంట్రుక ముక్క కూడా చంద్రబాబు పీకలేరు అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు ఉడత ఊపులకు భయపడను.. చంద్రబాబు ఎంతటి మోసగాడో అందరికీ చెబుతూనే ఉంటాను.. గెలుపు కోసం పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకుంటున్నారు.. బూట్లు నాకుతున్నారు.. శత్రువుకు కూడా లోకేష్ లాంటి కొడుకు పుట్టకూడదు.