Kodali Nani: పనికి రాని వాళ్లనే సీఎం పక్కన పెట్టారు.. ప్రతిసారీ అదే నేతలకు టిక్కెట్లివ్వాలా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodali Nani: అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ల మార్పులు, చేర్పులు హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. ఇప్పటికే మూడు లిస్ట్‌లు విడుదల కాగా.. నాలుగో లిస్ట్‌పై కసరత్తు చేస్తోంది వైసీపీ అధిష్టానం.. అయితే, ఈ సారి సీటు దక్కదు అని సమాచారం అందిన కొందరు నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు.. అయితే, ఈ పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. పనికి రాని వాళ్లనే సీఎం వైఎస్ జగన్ పక్కన పెట్టాడన్న ఆయన.. వైఎస్ జగన్ ఎవరినైతే పక్కన పెట్టారో.. వాళ్లే టీడీపీకి వెళ్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిసారీ అదే నేతలకు టిక్కెట్లివ్వాలా..? అని ఎదురుప్రశ్నించారు.
Read Also: Venugopal Krishna: బెయిల్ రద్దు అయితే చంద్రబాబు జైలుకే.. చేసిన తప్పుకు మూల్యం చెల్లించక తప్పదు..!
Also Read
పార్థసారథిని సీఎం వైఎస్ జగన్ పక్కన పెట్టారు.. మేమేళ్లి పార్టీలో ఉండమని కోరాం. ఇన్నాళ్లూ కలిసి పని చేశాం.. ఇప్పుడెందుకు పార్టీని వీడడమని అడిగాం అని తెలిపారు కొడాలి నాని.. ఇక, మార్పులు, చేర్పులు పార్టీ అధినేత ఇష్టమన్న ఆయన.. టీడీపీలో మాత్రం ఎంత మందిని మార్చలేదు..? అని ప్రశ్నించారు. చంద్రగిరి నుంచి కుప్పానికి చంద్రబాబు వెళ్లలేదా..? మంగళగిరిలో చిన్నప్పటి నుంచి లోకేష్ ఏమైనా గోళీలు ఆడాడా..? గుడివాడలో నా మీద ఇప్పటి వరకు నలుగురు మారారు.. దీనికేం సమాధానం చెబుతారు..? అని నిలదీశారు. ఇక, ఈ రోజు గుడివాడలో చంద్రబాబు సభపై హాట్ కామెంట్లు చేశారు కొడాలి నాని.. గుడివాడలో చంద్రబాబును చూసేవాళ్లు ఎవరున్నారు..?చంద్రబాబు సభకు లక్ష మంది ఎక్కడ నుంచి వస్తారు..? 20 ఎకరాల స్థలంలో పార్కింగ్‌కు పోనూ మిగిలిన స్థలమెంత..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాదు చంద్రబాబు సభ కోసం 5 వేలకు మించి కుర్చీలేస్తే గుడివాడ వదిలిపోతాను అంటూ సవాల్ చేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!