Chandrababu Vs Kodali Nani: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా.. గుడివాడలో పొలిటికల్ రగడ మొదలైంది.. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా టీడీపీ, వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.. ఇవాళ గుడివాడలో టీడీపీ రా కదలిరా పేరుతో భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు.. మరోవైపు.. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలోనూ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు.. ఇప్పటికే పోటాపోటీగా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు.. దీంతో, గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది.. అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోస్తు ఏర్పాటు చేశారు.
గుడివాడ ముదినేపల్లి రోడ్డులో చంద్రబాబు రా కదలిరా సభ, ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలకు సర్వం సిద్ధ చేశాయి టీడీపీ శ్రేణులు.. పసుపు వర్ణంగా మారింది ముదినేపల్లి రోడ్డు.. భారీగా స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇక, పోటీగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను ప్లాన్ చేశారు ఎమ్మెల్యే కొడాలి నాని.. ఉదయం 11 గంటలకు బైక్ ర్యాలీ, మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లలో మునిగిపోయారు.. పట్టణ ప్రధాన హార్డింగ్ లపై టీడీపీ బ్యానర్లకు పోటీగా, సీఎం వైఎస్ జగన్ ఫొటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇటీవల రంగ వర్ధంతి కార్యక్రమాల్లో వైసీపీ శ్రేణుల అలజడులు.. అదే పరిస్థితి పునరావృతం అవుతుందేమొనన్న ఆందోళనలో పోలీసు వర్గాలు ఉన్నాయి.. మొత్తంగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో రాజకీయ రగడ మొదలైంది.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి..