మేడ్చల్ జిల్లా టీఆర్‌ఎస్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మంత్రి మల్లారెడ్డి పేరు చెబితేనే పార్టీ శ్రేణులు విరుచుకుపడుతున్నాయి. మల్లారెడ్డి ఇలాకాలోనే కొందరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కలిపి మొత్తం 8 మంది టీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పేశారు. వారి రాజీనామాల అంశం ఇప్పుడు స్థానికంగా సెగలు రేపుతోంది. మంత్రి అవమానిస్తున్నారని ఆరోపణలు..!జిల్లాలోని కీసర టీఆర్ఎస్‌లో నేతల మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. అవి తాజాగా భగ్గుమనడంతో రాజీనామాల వరకు వెళ్లింది. యాదర్‌పల్లి ఉప సర్పంచ్ సహా 8మంది…
లెక్కలో తేడా వచ్చింది.. అనుచరులపై ఎమ్మెల్యేకు కోపం వచ్చింది..! కుర్చీలో నుంచి దించేసేందుకు రంగం సిద్ధం చేశారట. ఈ విషయం బయటకు గుప్పుమనడంతో కోదాడ టీఆర్‌ఎస్‌లో చెవులు కొరుకుడు ఎక్కువైంది. అదేంటోఈ స్టోరీలో చూద్దాం. వైరి వర్గాలుగా ఎమ్మెల్యే.. మున్సిపల్ ఛైర్‌పర్సన్..! సూర్యాపేట జిల్లా కోదాడలో నిన్న మొన్నటి వరకు కామ్‌గా ఉన్న టీఆర్ఎస్ రాజకీయాలు ఒక్కసారిగా కాక రేపుతున్నాయి. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు కోదాడ మున్సిపల్ ఛైర్‌పర్సన్ వనపర్తి శిరీష.. ఆమె భర్త లక్ష్మీనారయణలకు…